టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.ఇందులో భాగంగా చంద్రబాబు తరపున న్యాయవాదులు హరీశ్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం తరపున లాయర్లు ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు.ఈ క్రమంలో విచారణ ఎప్పుడు ప్రారంభమైందని జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రశ్నించారని తెలుస్తోంది.
దీనిపై ప్రాథమిక విచారణ 2021లో ప్రారంభమైందని చంద్రబాబు తరపు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు.సెప్టెంబర్ 7, 2021న ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభమైందన్న సాల్వే ఆ ఫిర్యాదుతో పిటిషనర్ కు సంబంధమే లేదని చెప్పారు.
ఆ ఫిర్యాదు డిజైన్ టెక్ అనే కంపెనీకి సంబంధించిందని పేర్కొన్నారు.ఒప్పందం ఎవరితో జరిగిందని జస్టిస్ త్రివేది ప్రశ్నించగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని సాల్వే తెలిపారు.
డిజైన్ టెక్, స్కిల్ టెక్ మధ్యలో జీఎస్టీకి సంబంధించిన ఫిర్యాదని కోర్టుకు తెలిపారు.







