మామూలుగా తెలుగులో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలు కూడా డబ్బింగ్ అయ్యే విడుదల అవుతూ ఉంటాయి.సినిమా నచ్చితే చాలు భాషతో సంబంధం లేకుండా ఆ సినిమాను బాగా ఆదరిస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు.
ఈ విషయంలో మాత్రం తెలుగు ప్రేక్షకులు చాలా గొప్ప హృదయం అని చెప్పవచ్చు.అందుకే అనువాద చిత్రాలు తెలుగులో ఆడినంతగా ఇండియాలో మరే భాషలోనూ ఆడవు అంటే అతిశయోక్తి కాదు.
ముఖ్యంగా తెలుగులో ఇక్కడి పెద్ద సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రాలు బోలెడు ఉన్నాయి.

ఊరూ పేరు లేని హీరోలు నటించిన సినిమాలు కూడా ఇక్కడ గొప్పగా ఆదరణ పొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి.కానీ టాలీవుడ్ సినిమాలు తమిళంలో విడుదల అయితే మాత్రం అందుకు పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది.టాలీవుడ్ సినిమాలు ( Tollywood )కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగినా ఇతర భాషల్లో రిలీజ్ చేసిన అన్ని సినిమాలూ ఏమీ ఆడేయవు.
ముఖ్యంగా తమిళనాట బాగా ఆడిన తెలుగు చిత్రాలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు.మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసినా అక్కడ థియేటర్లు దక్కడం, సరైన రిలీజ్ లభించడం అన్నది చాలా కష్టం.
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి కొన్ని చిత్రాలకే తమిళ పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి మద్దతు లభించింది.

కాగా ఈ దసరాకు తెలుగు నుంచి రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు( Tiger nageswararao ) అనే పాన్ ఇండియా మూవీ విడుదల కాబోతోంది.పాన్ ఇండియా అప్పీల్ ఉన్న ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్నారు.కానీ ఈ చిత్రానికి తమిళనాట ఒక మోస్తరుగా కూడా థియేటర్లు దక్కే పరిస్థితి లేదు.
హిందీలో ఈ చిత్రానికి మంచి సపోర్ట్ లభిస్తోంది. అక్కడ థియేటర్లు కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు.
కానీ తమిళ రిలీజ్ మాత్రం కష్టంగా మారిందట.అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి పేరున్న సంస్థల సపోర్ట్ దక్కలేదు.
అలాగే థియేటర్ల సమస్య కూడా పెద్దగానే కనిపిస్తోంది.విజయ్ చిత్రం లియో తోనే థియేటర్లన్నింటినీ నింపేస్తున్నారు.
దీంతో టైగర్ నాగేశ్వరరావు సినిమాకు కనీస మద్దతు లభించకపోగా సినిమా హాలు ఒక్కటి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి.ఒక రకంగా చెప్పాలి అంటే హీరో రవితేజ( Ravi teja ) కి ఏదో ఒక అవమానం లాంటిదే అని చెప్పవచ్చు.







