మంచు తుఫానులో ప్రతి ఉద్యోగిని ఇంటిదగ్గర సేఫ్‌గా దించిన బాస్.. ఎందుకో తెలిస్తే...

ప్రస్తుతం ప్రపంచంలోని చాలా ప్రదేశాలు ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోయాయి.ముఖ్యంగా మంచు కురవడం( Snow Fall ) వల్ల అనేక ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 Boss Picks Up Every Employee In His Car To Ensure They Dont Call In Sick During-TeluguStop.com

బయట అడుగు పెట్టలేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో నెలకొన్నది, కొన్నిచోట్ల మంచు తుఫాన్లు( Snow Storm ) వస్తున్నాయి.దీనివల్ల పనికి వెళ్లడం కష్టతరం అవుతోంది.

కొంతమంది వర్కర్స్ ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటును పొందారు, కానీ ఇతరులు ఆఫీసులు వెళ్లక తప్పడం లేదు.ఆఫీస్‌కి వెళ్లే ఓపిక లేనివారు మంచు తుఫాను వల్ల రాలేకపోతున్నామని సాకులు చెబుతూ ఇంట్లో కూర్చుంటున్నారు.

అయితే ఇలాంటి సాకులు చెప్పే అవకాశం లేకుండా ఒక బాస్( Boss ) తన ప్రతి ఉద్యోగికి ఊహించని షాక్ ఇచ్చాడు.వివరాల్లోకి వెళ్తే, ఒరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌కు( Portland ) చెందిన ఒక బాస్ మంచు తుఫాను సమయంలో తన ఉద్యోగుల కోసం ఓ వెరైటీ పని చేసే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు.అతని ఉద్యోగులలో ఒకరైన అమీరా రఫిన్ టిక్‌టాక్‌లో బాస్ గురించి వీడియో పోస్ట్ చేసింది.తన బాస్ ఉద్యోగులందరినీ( Employees ) స్వయంగా కారులో ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి డ్రైవ్ చేశాడని చెప్పింది.

మంచు కారణంగా ఉద్యోగులు ఇంట్లో ఉండకూడదని అతను కోరుకున్నాడని వివరించింది.తన యజమాని కష్టాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పింది.ఆమె వీడియో “ఆ రోజు అతను దుకాణాన్ని మూసివేస్తాడని నేను ఆశించాను.” ఈ వీడియోకు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.వీడియోలో ఆమె, ఆమె సహోద్యోగులు వర్క్ ప్లేస్ బయటకు మంచులో ఉన్నారు.ఆ వీడియో చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియా సైట్స్‌లో వైరల్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube