మరోసారి బీజేపీ సెంటిమెంట్ రాజకీయం... కలిసి వచ్చేనా?

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో ఇక బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రోజు రోజుకు మరింత బలపడేలా వ్యూహ రచన చేస్తోంది.

 Bjp Sentiment Politics Once Again Will It Come Together, Bandi Sanjay, Bjp Party-TeluguStop.com

అయితే తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీ బలంగా లేదు కాబట్టి బీజేపీ తరహా రాజకీయం తెలంగాణ ప్రజలకు పరిచయం ఉండదు.కావున ఇప్పటి వరకు జరిగిన రాజకీయాల కన్నా బీజేపీ ఎంతో కొంత బలపడ్డాక  రాజకీయం పూర్తిగా మారిపోయిన పరిస్థితి ఉంది.

అదే సెంటిమెంట్ రాజకీయం.అయితే అయితే ప్రస్తుతం ఏదైతే బీజేపీకి ఉన్న వ్యతిరేక పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి బీజేపీ సెంటిమెంట్ అస్త్రం అనేది తరచుగా ఉపయోగిస్తూ ఉంటుంది.

ఉదాహరణకు దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావుపై దాడి చేశారని చెప్పి చేతి మణికట్టుకు పట్టీతో పోలింగ్ తేదీ వరకు ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఉంది.

అయితే త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కూడా మరో సారి సెంటిమెంట్ రాజకీయాన్ని తెర మీదికి తీసుక రానున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈటెల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు దాడి చేసినట్లుగా చిత్రీకరిస్తూ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ ను బూచిగా చూపెట్టే అవకాశం ఉంది.అయితే ప్రస్తుతం బీజేపీ టీఆర్ఎస్ ను అన్ని విధాలుగా బలహీన పరుస్తూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హుజూరాబాద్ ఓటర్ లను బీజేపీ వైపు మళ్లించుకొని హుజూరాబాద్ లో బీజేపీ జెండా ఎగురవేయాలని వ్యూహ రచన చేస్తోంది.

అయితే బీజేపీ సెంటిమెంట్ వ్యూహం ఎంత వరకు హుజూరాబాద్ లో బీజేపీ గెలిపించడానికి ఉపయోగపడుతుందనేది వేచి చూడాల్సి ఉంది.మరి బీజేపీ హుజూరాబాద్ లో గెలవడానికి వేసిన వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube