బీఆర్ఎస్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని మండిపడ్డారు.
హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.ప్రీతికి న్యాయం చేస్తారో లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
సీఎం కేసీఆర్ సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తారని ఆమె ఆరోపించారు.కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపితే తప్ప న్యాయం జరగదని విజయశాంతి వ్యాఖ్యనించారు.
అదేవిధంగా ప్రీతి మరణంపై దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.