టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఈ మేరకు రేపు అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేస్తామని తెలిపారు.
అదేవిధంగా పేపర్ లీక్ విషయంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.