బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న దీక్షకు బీజేపీ కౌంటర్ ఇవ్వనుంది.ఇందులో భాగంగా రేపు బీజేపీ కార్యాలయంలో నిరసన దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ నిరసన దీక్షలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణలతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.కాగా తెలంగాణలో పెరిగిన బెల్ట్ షాపులకు నిరసనగా బీజేపీ దీక్ష నిర్వహించనుంది.