బిగ్ బాస్ షో సీజన్ 7( Bigg Boss 7 ) కంటెస్టెంట్లలో ఇప్పటికే చాలామంది ఎలిమినేట్ అయ్యారు.తాజాగా భోలే షావళి( Bhole Shavali ) బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా ఆయన షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లకు కూడా మొదటివారం నుంచి రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.ఈ వారం ఎలిమినేషన్ కు శివాజీ, పల్లవి ప్రశాంత్ మినహా మిగతా కంటెస్టెంట్లు అంతా నామినేషన్ లో ఉన్నారని సమాచారం అందుతోంది.
గత కొన్ని వారాలుగా మేల్ కంటెస్టెంట్లు వరుసగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.రతిక( Rathika ) ఈ వారం ఎలిమేనేట్ అయ్యే ఛాన్స్ ఉందని బోగట్టా.
శోభాశెట్టిపై( Shobha Shetty ) ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఉన్నా మరికొన్ని వారాల పాటు ఆమె హౌస్ లో కొనసాగనున్నారని తెలుస్తోంది.అందుకు వేరే కారణాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
![Telugu Bhole Shavali, Bigg Boss, Biggboss, Nagarjuna, Priyanka Jain, Rathika, Sh Telugu Bhole Shavali, Bigg Boss, Biggboss, Nagarjuna, Priyanka Jain, Rathika, Sh](https://telugustop.com/wp-content/uploads/2023/11/bigg-boss-7-nominated-contestants-priyanka-shobha-shetty-rathika-detailsd.jpg)
కెప్టెన్ శివాజీ నామినేషన్స్ లో నీ టాలెంట్ చూపించు అంటూ రతికను రెచ్చగొట్టారు.రతికా రోజ్ ప్రియాంక, శోభాశెట్టిలను నామినేట్ చేశారు.ప్రియాంక జైన్( Priyanka Jain ) బిగ్ బాస్ హౌస్ లో చివరి వారం వరకు కొనసాగే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ప్లాన్ ఈ సీజన్ కు ప్లస్ అయిందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
![Telugu Bhole Shavali, Bigg Boss, Biggboss, Nagarjuna, Priyanka Jain, Rathika, Sh Telugu Bhole Shavali, Bigg Boss, Biggboss, Nagarjuna, Priyanka Jain, Rathika, Sh](https://telugustop.com/wp-content/uploads/2023/11/bigg-boss-7-nominated-contestants-priyanka-shobha-shetty-rathika-detailsa.jpg)
బిగ్ బాస్ సీజన్7 కోసం నాగార్జున( Nagarjuna ) ఎంతో కష్టపడ్డారని సమాచారం అందుతోంది.బిగ్ బాస్ షో తర్వాత సీజన్లకు సైతం నాగ్ హోస్ట్ గా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.బిగ్ బాస్ షో నాగ్ రేంజ్ ను రెట్టింపు చేస్తుందని మరి కొందరు చెబుతున్నారు.బిగ్ బాస్7 రాబోయే రోజుల్లో ఎలాంటి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.