మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు( PV Narasimha Rao ) భారతరత్న పురస్కారం వచ్చింది.ఈ మేరకు పీవీకి భారతరత్న( Bharat Ratna ) అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ విషయాన్ని ప్రధాని మోదీ( PM Modi ) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.మాజీ ప్రధానులు పీవీ, చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.
కాగా పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.అంతేకాకుండా బహుభాషా కోవిదుడిగా పీవీకి గుర్తింపు వచ్చింది.అలాగే 1991 నుంచి 1996 వరకు తొమ్మిదవ ప్రధానిగా పీవీ పని చేసిన సంగతి తెలిసిందే.అయితే ఒకే ఏడాది ఐదుగురికి కేంద్ర భారతరత్న ప్రకటించడం విశేషం.