టాలీవుడ్ లో రీ రిలీజ్( Re Release ) ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.స్టార్ హీరోల సినిమాలలో సూపర్ హిట్ అయిన సినిమాలను రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడం ఈ మధ్య ఆనవాయితీగా మారింది.
ఇక ఇప్పుడు బాలకృష్ణ( Balakrishna ) వంతు వచ్చింది.ఈయన పుట్టిన రోజు త్వరలోనే రాబోతుంది.
జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు( Balakrishna Birthday ) జరుపుకుంటున్న నేపథ్యంలో ఈయన సినిమా కూడా రీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది.
బాలయ్య కెరీర్ లో మాస్ సినిమాలనే ఎక్కువుగా చేసాడు.యాక్షన్ సినిమాలంటే ముందుగా బాలయ్యనే గుర్తుకు వస్తాడు.అయితే కెరీర్ స్టార్టింగ్ లో ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసి ఫ్యాన్స్ ను మెప్పించాడు.
మరి బాలయ్య కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచినా సినిమా ”భైరవ ద్వీపం”( Bhairava Dweepam movie ).ఈయన కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.ఇప్పటికి టీవీల్లో ఈ సినిమా అలరిస్తూనే ఉంది.
సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో ఇది ఒకటి.
ఈ ఫాంటసీ థ్రిల్లర్ ను ఇప్పుడు 4K లో రీ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.జూన్ 10న బాలయ్య బర్త్ డే కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
మరి ఇలాంటి సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనుకునే వారికీ ఇది మంచి ఛాన్స్ అనే చెప్పాలి.
ఇదిలా ఉండగా ప్రజెంట్ బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ‘NBK108’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.
ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.