తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య బాబు ( Balayya Babu )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఇప్పటికి ఆయన తీసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
ఆయన రీసెంట్ గా తీస్తున్న భగవంత్ కేసరి సినిమా ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఈనెల 8వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో ఉండే విధంగా అనిల్ రావిపూడి ( Anil Ravipudi )ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అనిల్ రావిపూడి ఇంతకుముందు తీసిన అన్ని సినిమాలు ఒకెత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు అన్నట్టుగా ఈ సినిమాని ఆయన చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా టీజర్ ని చూసిన మనకు ఆ విషయం అర్థమైపోతుంది.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే బాలయ్య బాబు ఈ సినిమాలో ఒక గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు అలాగే ఆ గిరిజనుల కోసం ఒక రాజకీయ పార్టీతో పోరాటం చేసే పాత్రలో బాలయ్య బాబు ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తుంది.
ఇక అదే విధంగా తన భార్యకి, తన కూతురికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి వాళ్లని ఎలా కాపాడుకుంటాడు అనేది ఈ సినిమా ప్రధాన అంశంగా తెలుస్తుంది.ఈ సంవత్సరం ఇంతకుముందే బాలయ్య సంక్రాంతికి వచ్చి మంచి హిట్ అందుకున్నాడు దాంతో బాలయ్య ఇప్పుడు దసరాకి కూడా తన సినిమాతో ఒక మంచి హిట్టు కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమా కనక హిట్ అయితే బాలయ్య బాబు వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, ( Veera Simha Reddy )భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లని నమోదు చేసుకుంటాడు…
.