దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి అభినయ( Abhinaya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రవితేజ అల్లరి నరేష్ శివ బాలాజీ హీరోలుగా నటించిన శంభో శివ శంభో ( Shambo Shiva Shambo ) సినిమాలో మూగమ్మాయి పాత్రలో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.
తెలుగులో ఈమె నేనింతే, కింగ్, దమ్ము, డమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సీతారామం, ధ్రువ వంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.
ఇలా మాట రాకపోయినా వినికిడి లేకపోయినా తనలో ఎన్నో హావభావాలు ఉన్నాయని వాటిని ఎంతో అద్భుతంగా పలికించడంతో నటిగా ఈమె ఎంతో మంచి సక్సెస్ సాధించారని తెలుస్తోంది.ఇలా మూగమ్మాయి అయినప్పటికీ ఇండస్ట్రీలో ఎంతో ఆదరణ పొందినటువంటి ఈమె మౌనం వెనుక ఎన్నో కన్నీటి కష్టాలు ఉన్నాయని చెప్పాలి.ఈమె చిన్నప్పుడే వినికిడి లోపంతోనూ,మాట రాకపోవడంతో తన తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలుస్తుంది.
ఎలాగైనా తన కూతురికి మాటలు తెప్పించాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారట.
తన కూతురు మాటలు వినాలనే ఉద్దేశంతో తన తల్లిదండ్రులు స్నేహితులు బంధువుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బు అప్పు చేసి మరి ఈమెకు వైద్యం చేయించారు ఇలా ఎన్నోచోట్ల వైద్యం చేయించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.ఈమె చికిత్స కోసం అప్పట్లోనే దాదాపు 11 లక్షల వరకు అప్పు చేసి ఖర్చు చేశారని తెలుస్తుంది.ఈ విధంగా పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు చేసిన తన కుమార్తెకు మాట రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో కుమిలి పోయారని తెలుస్తోంది.
అయితే తనకు నటిగా ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో వచ్చిన అవకాశాలను ఎంతో సద్వినియోగం చేసుకుంటూ మాట రాకపోయినా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని చెప్పాలి.