2023 సంవత్సరంలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో దసరా సినిమా( Dussehra movie ) ఒకటనే సంగతి తెలిసిందే.నాని, కీర్తి సురేష్ సినీ కెరీర్ లో ఈ సినిమా అతిపెద్ద హిట్ గా నిలిచింది.
దాదాపుగా 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ సినిమా నిర్మాతకు విడుదలకు ముందు విడుదల తర్వాత భారీ స్థాయిలో లాభాలను అందించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.అయితే ఒక సింగర్, నటుడు దసరా సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
శ్రీకాకుళంకు చెందిన సింగర్ శ్రీను( Singer Srinu ) 3200కు పైగా పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఈ సింగర్ పాడిన పాటలలో మెజారిటీ పాటలు జానపద గీతాలు కావడం గమనార్హం.
సొంతంగా పాటలు రాసి పాడే సామర్థ్యం ఉన్న ఈ సింగర్ దసరా సినిమాకు పని చేసినా డబ్బులు ఇవ్వలేదంటూ సంచలన ఆరోపణలు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
సాధారణంగా చిన్న సినిమాలకు సంబంధించి ఈ తరహా కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి.పదకొండేళ్ల వయస్సులోనే ఇంటినుంచి బయటకు వచ్చానని సింగర్ శ్రీను అన్నారు.కొన్ని సినిమాలకు బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ గా పని చేశానని ఆయన తెలిపారు.
దసరా సినిమా కోసం 23 మంది ఆర్టిస్టులను గోదావరిఖనికి తీసుకెళ్లి వారం రోజులు అక్కడే ఉన్నానని సింగర్ శ్రీను చెప్పుకొచ్చారు.షూట్ అయిపోయాక చిత్రయూనిట్ నుంచి రూపాయి కూడా రాలేదని ఆయన తెలిపారు.
ఆ 23 మందికి 70 వేలు ఇచ్చి నేను ఆర్థికంగా నష్టపోయానని ఆయన తెలిపారు.
కెరీర్ తొలినాళ్లలో నేను జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేశానని శ్రీను అన్నారు.క్యాస్టింగ్ డైరెక్టర్లు ఆర్టిస్టులకు డబ్బు విషయంలో మోసం చేస్తారని శ్రీను వెల్లడించారు.శ్రీను వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.