బాలయ్య, బాబీ మూవీ కోసం ఆ ఇద్దరు హీరోయిన్స్‌ తో చర్చలు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వం లో రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari Movie ) షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే.ఆ వెంటనే బాబీ దర్శకత్వం లో సినిమాకు బాలయ్య డేట్లు ఇచ్చాడు.

 Balakrishna And Bobby Movie Heroines Update , Balakrishna , Bobby Movie, Anil-TeluguStop.com

ఇప్పటికే ఒక చిన్న షెడ్యూల్‌ ను దర్శకుడు బాబీ ముగించాడు.బాలయ్య వచ్చేప్పటికి హీరోయిన్‌ ను కన్ఫర్మ్‌ చేస్తే వెంటనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేయాలని దర్శకుడు బాబీ భావిస్తున్నాడు.

Telugu Anil Ravipudi, Balakrishna, Bobby, Bollywood, Shriya Saran, Sitara, Tolly

కథానుసారంగా ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్స్ అవసరం అవుతారట.అందులో ఒక హీరోయిన్ గా శ్రియ శరణ్( Shriya Saran ) ను ఎంపిక చేసేందుకు గాను చర్చలు జరుగుతున్నాయి.మరో హీరోయిన్‌ పాత్రకు గాను బాలీవుడ్‌ హాట్ బ్యూటీ తో చర్చలు జరుపుతున్నారు అంటున్నారు.ఆ బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఎవరు అనే విషయం లో స్పష్టత లేదు.

కానీ కచ్చితంగా ఒక హీరోయిన్ గా శ్రియ కనిపించబోతుండగా మరో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ కనిపించబోతుంది అంటున్నారు.ఆ మధ్య దర్శకుడు బాబీ ముంబై వెళ్లి ఒక హీరోయిన్‌ తో చర్చలు కూడా జరిపాడు అంటున్నారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Bobby, Bollywood, Shriya Saran, Sitara, Tolly

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జోరుగా సాగుతోంది.ముందు ముందు బాబీ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయం లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌ కు హీరోయిన్స్ ను కన్ఫర్మ్‌ చేయడం రెగ్యులర్‌ షూటింగ్‌ చేయడం జరుగుతుందని దర్శకుడి సన్నిహితులు అంటున్నారు.బాలయ్య ప్రతి సినిమా విషయంలో హీరోయిన్స్ వద్ద ఇబ్బంది అవుతుంది.

అందుకే ఇప్పుడు కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టి బాలీవుడ్ నుండి రప్పిస్తున్నారట.హనీ రోజ్‌ పేరు కూడా వినిపించింది కానీ చివరి నిమిషంలో ఆమె ను తప్పించారు అనేది టాక్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube