ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ భారత్ కు రానున్నారు.నేటి నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు.
ఆంటోనీ అల్బనీస్ తోపాటు, ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్, వనరుల మంత్రి మెడ్లీన్ కింగ్, ఉన్నతాధికారుల బృందం భారత్ కు రానుందని తెలుస్తోంది.ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలో అరుదైన ఖనిజాల అన్వేషణకు సంబంధించిన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వరంగ సంస్థల జాయింట్ వెంచర్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఆస్ట్రేలియలో పెట్టుబడులు పెట్టనుందని సమాచారం.