చావు అప్పుడప్పుడు భళే విచిత్రంగా సంభవిస్తూ ఉంటుంది.తిండి తినే పోటీల్లో పాల్గొన్న ఓ మహిళ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే.ఆదివారం ఆస్ట్రేలియా దినోత్సవం సందర్భంగా క్వీన్స్‌లాండ్‌లోని హెర్వీ బేలోని ఒక హోటల్‌లో జరిగిన ఫుడ్ ఫెస్టివల్‌లో 60 ఏళ్ల మహిళ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోటీదారులు వేగంగా కొబ్బరి, చాక్లెట్‌తో గార్నిష్ చేయబడిన స్పాంజ్ కేక్-లామింగ్టన్లను వేగంగా తినాలి, ఎవరు ఎక్కువ తింటే వారే పోటీలో విజేత.
పోటీ మధ్యలో ఉండగా ఆమెకు మూర్చ రావడంతో కిందపడిపోయారు.
దీంతో నిర్వాహకులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.అక్కడికి వెళ్లిన క్షణాల్లోనే పెద్దావిడ తుదిశ్వాస విడిచారు.
ఈ ఘటనపై ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.కేకు మొత్తాన్ని ఆమె నోట్లో కుక్కుతూ ఉండగా మూర్చకు గురైయ్యారని తెలిపింది.
పోటీల్లో విషాదంపై హెర్వీ బేలోని బీచ్ హౌస్ హోటల్ ఆ వృద్ధురాలి కుటుంబానికి సంతాం తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.అలాగే ఆ మహిళ ప్రాణాలు ప్రమాదంలో పడ్డప్పుడు వెంటనే స్పందించిన అంబులెన్స్ సర్వీస్‌కు కూడా హోటల్ ధన్యవాదాలు తెలిపింది.
ఆస్ట్రేలియా దినోత్సవం సందర్భంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో తినే పోటీలు నిర్వహించుకోవడం చాలా ఏళ్లుగా వస్తోంది.ఇది ఆసీస్ గడ్డపైకి మొదటి యూరోపియన్ల రాకను సూచించే జాతీయ సెలవుదినం.ఈ పోటీల్లో భాగంగా పోటీదారులు నిర్ణీత సమయంలో ఎక్కువ కేకులు, ప్రైస్, హాట్ డాగ్‌లు వంటి ఆహారాన్ని తినడం ద్వారా బహుమతులు గెలుచుకుంటూ ఉంటారు.
కాగా కొద్దిరోజుల క్రితం కాలిఫోర్నియాలో గాఫ్రెస్నో గ్రిలిలీస్ అనే సంస్థ టాకో ఈటింగ్ కాంటెస్ట్ పెట్టింది.టాకో అంటే మెక్సికో ప్రజలు తయారు చేసే సంప్రదాయ వంటకం.ఈ పోటీల్లో పాల్గొన్న హాచింగ్స్ అనే వ్యక్తి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో వేగంగా నమిలాడు.
ఈ క్రమంలో తింటుండగానే ఒక్కసారిగా టేబుల్‌పై కుప్పకూలిపోయాడు.వెంటనే స్పందించిన నిర్వాహకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.