కన్న బిడ్డలనే కడతేర్చారు కసాయి తల్లిదండ్రులు.ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా( Mahabubabad district )లో చోటు చేసుకుంది.
గార్ల మండలం అంకన్నగూడెం( Ankannagudem )లో నివాసం ఉంటున్న దంపతులు కందగట్ల అనిల్, దేవిల మధ్య గత కొంతకాలంగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే వారి ఇద్దరు కూతుళ్లకు విషం ఇచ్చి చంపారని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే పరారీలో ఉన్న దంపతులను పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.