PHD చేస్తున్నాను కాబట్టి, నాతో ఎవరూ మాట్లాడొద్దు అంటున్న విద్యార్థి.. ఎవరికెక్కువంటున్న నెటిజన్లు?

నేడు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ అనేది పరిపాటిగా మారిపోయింది.దాంతో సోషల్ మీడియా వినియోగం కూడా బాగా విస్తరించింది.

 As I Am Doing Phd The Student Says No One Should Talk To Me Who Cares Netizens-TeluguStop.com

అందువలన ప్రపంచం నలుమూలలా వున్న కొన్ని రకాల ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, కొన్ని ఆశ్చరంగా, మరికొన్ని విడ్డురంగా, ఇంకొన్ని ఒకింత జుగుప్సాకరంగా ఉంటున్నాయి.

ఇపుడు సోషల్ మీడియాలో తాజాగా ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.దాన్ని చూసిన నెటిజన్లు ‘అంతొద్దు… ఇది చాలు’ అన్న మాదిరి రియాక్ట్ అవుతున్నారు.

అవును, Phd చేస్తున్న ఓ విద్యార్థి, తన క్యాబిన్‌ దగ్గర పెట్టిన చిన్న నోట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.వివరాల్లోకి వెళ్తే.ఒక వ్యక్తి “Phdకి సంబంధించిన పని చేస్తున్నాను అందువల్ల నాతో ఎవరూ మాట్లాడొద్దు.మరీ అవసరమనుకుంటే మెయిల్‌ చెయ్యండి” అంటూ ఉన్న ఓ పేపర్‌ను తన క్యాబిన్‌ ఎదుట పెట్టాడు.

దానికి సంబంధించిన ఫొటోను స్టీవ్‌ బింగ్‌హామ్‌ అనే అధ్యాపకుడు ట్విట్టర్​లో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిపోయింది.దాంతో ఆ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది.

ఇక దాన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.కొందరు అతని ఏకాగ్రతను, సమయపాలనను కొనియాడితే, మరికొందరు ‘ఇంకా చాలించు.మేము కూడా డిగ్రీలు చేసాం’ అంటూ చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు Phd చేసిన విద్యార్థులు కామెంట్ చేస్తూ… “Phd చేసినపుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు.

అయితే ఏదైనా పనిని సకాలంలో ఫినిష్ చేసే ఇలాంటి పోస్ట్ పెట్టే అవసరం ఉండదు” అంటూ సలహాలు ఇచ్చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube