PHD చేస్తున్నాను కాబట్టి, నాతో ఎవరూ మాట్లాడొద్దు అంటున్న విద్యార్థి.. ఎవరికెక్కువంటున్న నెటిజన్లు?

నేడు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ అనేది పరిపాటిగా మారిపోయింది.దాంతో సోషల్ మీడియా వినియోగం కూడా బాగా విస్తరించింది.

అందువలన ప్రపంచం నలుమూలలా వున్న కొన్ని రకాల ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి.

అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, కొన్ని ఆశ్చరంగా, మరికొన్ని విడ్డురంగా, ఇంకొన్ని ఒకింత జుగుప్సాకరంగా ఉంటున్నాయి.

ఇపుడు సోషల్ మీడియాలో తాజాగా ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.దాన్ని చూసిన నెటిజన్లు 'అంతొద్దు.

ఇది చాలు' అన్న మాదిరి రియాక్ట్ అవుతున్నారు.అవును, Phd చేస్తున్న ఓ విద్యార్థి, తన క్యాబిన్‌ దగ్గర పెట్టిన చిన్న నోట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.ఒక వ్యక్తి "Phdకి సంబంధించిన పని చేస్తున్నాను అందువల్ల నాతో ఎవరూ మాట్లాడొద్దు.

మరీ అవసరమనుకుంటే మెయిల్‌ చెయ్యండి" అంటూ ఉన్న ఓ పేపర్‌ను తన క్యాబిన్‌ ఎదుట పెట్టాడు.

దానికి సంబంధించిన ఫొటోను స్టీవ్‌ బింగ్‌హామ్‌ అనే అధ్యాపకుడు ట్విట్టర్​లో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిపోయింది.

దాంతో ఆ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది.ఇక దాన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

కొందరు అతని ఏకాగ్రతను, సమయపాలనను కొనియాడితే, మరికొందరు 'ఇంకా చాలించు.మేము కూడా డిగ్రీలు చేసాం' అంటూ చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొందరు Phd చేసిన విద్యార్థులు కామెంట్ చేస్తూ."Phd చేసినపుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు.

అయితే ఏదైనా పనిని సకాలంలో ఫినిష్ చేసే ఇలాంటి పోస్ట్ పెట్టే అవసరం ఉండదు" అంటూ సలహాలు ఇచ్చేస్తున్నారు.

ఐఫోన్ వాడుతున్నారా.. మీరు మోసపోతున్నట్లే.. షాకింగ్ నిజం బయటపెట్టిన మహిళ!