ఒకటే మాస్క్ ఉపయోగిస్తున్నారా..?! జాగ్రత్త సుమా..!

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తుంది.రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

 Are You Using The Same Mask ..?! Be Careful Suma ..! Mask, Carona Virus, Covid-TeluguStop.com

కరోనా బారిన పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుతున్నప్పటికీ ఆ మహమ్మారి బారిన పడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇక గాలి ద్వారా కోవిడ్ వ్యాప్తిచెందుతున్నాయ‌న్న వార్త‌లు భ‌యాందోళ‌న‌కు గురిచేస్తుండ‌గా మ‌రో సంచ‌ల‌న వార్త మ‌న ముందుకు వ‌చ్చింది.

తాజాగా ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్‌సైన్సెస్ చీఫ్ ర‌ణ్‌దీప్ గులేరియా గాలి ద్వారా క‌రోనా వ్యాప్తిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.ఇదే స‌మ‌యంలో క‌రోనా నుంచి ర‌క్ష‌ణ కోసం ర‌ణ్‌దీప్ గులేరియా కీల‌క సూచ‌ల‌ను చేశారు.

 Are You Using The Same Mask ..?! Be Careful Suma ..! Mask, Carona Virus, Covid-TeluguStop.com

క‌రోనా గాలి ద్వారా వ్యాప్తి చెంద‌డం ఆందోళ‌క‌ర‌మైన విష‌యం అన్న ఆయ‌న‌ ఇళ్ల‌లో వెంటిలేష‌న్ చాలా ముఖ్య‌మ‌న్నారు.

కరోనా వైరస్ బారిన ‌ప‌డ‌కుండా ఉండేందుకు ఒక ఎన్‌95 మాస్క్‌ను స‌రిగ్గా ధ‌రిస్తే స‌రిపోతుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.ఎన్95 మాస్క్ కాకుండా బ‌ట్ట‌తో చేసిన లేదంటే స‌ర్జిక‌ల్‌ మాస్కులు వాడేవారైతే రెండు మాస్క్‌లు పెట్టుకోవాల‌ని సూచించారు.అయితే, మాస్కులు ఖచ్చితంగా నోరు, ముక్కును పూర్తిగా క‌వ‌ర్ చేసే విధంగా ధ‌రించాల‌న్నారు.

ఇక మ‌రోవైపు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ లేఖ రాశారు.క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై ప్ర‌ధాని మోడీకి మ‌న్మోహ‌న్ సింగ్ ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు.వ్యాక్సిన్‌ను మ‌రింత మందికి అందుబాటులోకి తేవాల‌ని కోరిన ఆయ‌న‌ కోవిడ్ నియంత్ర‌ణ కోసం వ్యాక్సిన్‌ను సాధ్య‌మైనంత ఎక్కువ మందికి ఇవ్వ‌డం ఎంతైనా ఉంద‌న్నారు.

అయితే రానున్న ఆరు నెల‌ల కోసం ఇప్పుడే వ్యాక్సిన్ల‌కు ఆర్డ‌ర్లు ఇవ్వాల‌ని సూచించిన ఆయ‌న‌ వాటిని రాష్ట్రాల‌కు పంపే ప్లాన్ కూడా సిద్ధం చేసుకోవాల‌న్నారు.

ఇదిలా ఉండ‌గా, క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ఇప్పుడు వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోంది.ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగా వ్యాక్సినేష‌న్ ప్ర‌భుత్వం పూర్తి చేసిందని వెల్లడించారు.

Video : Are You Using The Same Mask ?! Be Careful Suma ! Mask, Carona Virus, Covid 19, Carona Virus, Becarefull, One Mask, Using , Modi

Are you using the same mask ?! Be careful Suma ! mask, carona virus, covid 19, carona virus, becarefull, one mask, using , modi - Telugu Becarefull, Carona, Covid

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube