బుల్లితెర నటుడిగా ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసిన రవికృష్ణ(Ravi Krishna) మొదటిసారి వెండితెరపై విరుపాక్ష సినిమా ( Virupaksha Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా మొదటి సినిమాతో అద్భుతమైన నటనను కనబరిచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకున్నారు.
ఈ సినిమా ద్వారా నటుడిగా తానేంటో ప్రూఫ్ చేసుకుని అవకాశం రావడంతో తనలో ఉన్న నటన విశ్వరూపం చూపించారు.ఇక విరూపాక్ష సినిమా నటుడు రవికృష్ణకు ఎంతో మంచి పేరు తీసుకువచ్చిందని చెప్పాలి.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు ఇకపై వెండితెర అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో కష్టపడిన రవికృష్ణ ఒకానొక సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా(Assistant Director) కూడా ఇండస్ట్రీలో పని చేశారు అయితే ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశారు, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనే విషయానికి వస్తే… రవి కృష్ణ విజయవాడకు చెందిన అబ్బాయి.తండ్రి ఆర్టీసీ ఉద్యోగి.తల్లి గృహిణి.
డిగ్రీ వరకు విజయవాడలోనే చదివాడు రవి కృష్ణ. డిగ్రీ తర్వాత చెన్నై వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు.
చూడటానికి హీరో కట్ అవుట్ తో ఉన్నటువంటి ఈయన సినిమాలలో తొందరగా అవకాశాలని అందుకుంటారని భావించారు.అయితే ఈయనకు పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి.అవకాశాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలుస్తోంది.మన టాలెంట్ మాత్రమే కాదు అదృష్టం కూడా ఉండాలని దేవుడిపై భారం వేసిన అనంతరం ఇండస్ట్రీలో ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం అందుకున్నారు.
ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రవి కృష్ణకు విజేత/విజయం సీరియల్‌తో తన కెరీర్ ప్రారంభించాడు.ఆతర్వాత బొమ్మరిల్లు సీరియల్ లో నటించారు.అయితే ఈయనకు మొగలిరేకులు (Mogalirekulu)సీరియల్ మంచి హిట్ అందించిందని చెప్పాలి.
అనంతరం వరూధిని పరిణయం సీరియల్ కూడా మంచి హిట్ ఇచ్చింది.ఇలాపలు బుల్లితెర సీరియల్స్ లో నటించి బిగ్ బాస్ ( Big Boss )అవకాశాన్ని కూడా అందుకున్నారు.అయితే బిగ్ బాస్ ఈయనకు పెద్దగా సినిమా అవకాశాలను తీసుకురాలేకపోయింది.
ఇలా బుల్లితెర సీరియల్స్ లో కొనసాగుతున్న రవి కృష్ణకు విరూపాక్ష సినిమాలో కార్తీక్ అవకాశం కల్పించారు.ఇలా ఈ సినిమా ద్వారా తన సత్తా ఏంటో నిరూపించుకొని నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు.
ఈ సినిమాలో రవి కృష్ణ పాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఈయన సంతోషంతో ఎమోషనల్ అయ్యారు.అయితే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రవికృష్ణ కెరియర్ మలుపు తిరిగిందని కూడా ఇండస్ట్రీలో బిజీగా మారబోతున్నారని తెలుస్తోంది.