ట్రిపుల్ ఐటీలో చదువు.. టాలెంట్ తో గ్రూప్1 ఉద్యోగం.. రుధిర సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

గ్రూప్1 ర్యాంక్( Group1 Rank ) ను చిన్న వయస్సులో సాధించడం సులువైన విషయం కాదు.చాలామంది ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే అక్కడితో మరో ఉద్యోగం కోసం చేయాల్సిన ప్రయత్నాలను ఆపేస్తారు.

 Appsc Group1 Ranker Rudhira Success Story Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

అయితే నెల్లూరు జిల్లాలోని కొత్తూరుకు చెందిన రుధిర( rudhira ) మాత్రం గ్రూప్1 ర్యాంక్ సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.రుధిర తల్లి శాంతికుమారి గతంలో పొదలకూరు రెవిన్యూ కార్యాలయంలో ఉద్యోగిగా పని చేశారు.

వరదాపురం శ్రీ సాయినాథ్ స్కూల్ ( Varadapuram Sri Sainath School )లో పదో తరగతి వరకు చదివిన రుధిర పదో తరగతిలో మంచి మార్కులు సాధించారు.పదో తరగతి పూర్తైన తర్వాత రుధిర ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి వెళ్లి 2021లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పట్టా పుచ్చుకున్నారు.

ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో రుధిర జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి పరీక్ష రాసి ఆ పరీక్షకు ఎంపికయ్యారు.నెల్లూరు కోర్టులో రుధిర కొంతకాలం పని చేశారు.

రుధిర మాట్లాడుతూ పోటీ పరీక్షల కోసం హైదరాబాద్( Hyderabad ) లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నానని ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యమని ఆమె చెబుతున్నారు.గ్రూప్1 ఉద్యోగం సాధించిన రుధిర భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని కూడా సాధిస్తారేమో చూడాల్సి ఉంది.పట్టుదల, కృషి ఉంటే సక్సెస్ సొంతమవుతుందని ఆమె ప్రూవ్ చేయడం గమనార్హం.రుధిర సక్సెస్ స్టోరీని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

కుటుంబం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటే సక్సెస్ సాధించడం సులువేనని ఆమె చెబుతున్నారు.ప్రస్తుతం రుధిర అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్( Assistant Treasury Officer ) గా పని చేస్తున్నారు.గ్రాడ్యుయేషన్ పూర్తైన రెండు సంవత్సరాలలోనే రుధిర తన లక్ష్యాలను సాధించి ప్రశంసలను సొంతం చేసుకుంటున్నారు.ప్రిపరేషన్ సమయంలో నాన్న నా లక్ష్య సాధన కోసం ఎంతో సహాయం చేశారని రుధిర వెల్లడించారు.

రుధిర చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube