ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగనుంది.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ స్థానాలతో పాటు తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని ఈసీ తెలిపింది.ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు.
, కడప- అనంతపురం – కర్నూలుతో పాటు శ్రీకాకుళం – విజయనగరం -విశాఖ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు, కడప -అనంతపురం -కర్నూలు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు … అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాల స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది.నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ ఈనెల 23 కాగా… మార్చి 13న పోలింగ్ జరగనుంది.
మార్చి 16వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ఉండనుందని ఈసీ వెల్లడించింది.
అటు తెలంగాణలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి షెడ్యూల్ విడుదలైంది.
మహబూబ్ నగర్ -రంగారెడ్డి -హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది.