27 న ఐప్యాడ్ లతో ఏపీ క్యాబినెట్ సమావేశం 

ఈనెల 27వ తేదీన ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.అమరావతిలోని సచివాలయంలో ఈ క్యాబినెట్ సమావేశం జరగబోతోంది.

 Ap Cabinet Meeting With Ipads On 27, Ap Elections, Ap Government, Cbn, Ap Cm Ch-TeluguStop.com

గత క్యాబినెట్ సమావేశాలకు భిన్నంగా వినూత్న రీతిలో కాగిత రహిత క్యాబినెట్ సమావేశం( Cabinet meeting ) నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు.కాగిత రహిత క్యాబినెట్ లో భాగంగా మంత్రులకు ఐ ప్యాడ్ లు ఇవ్వాలని నిర్ణయించారు.

ఇకపై క్యాబినెట్ సమావేశాలను ఎలక్ట్రానిక్ ఫార్మేట్( Electronic format ) లోనే జరుగుతాయని టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.గత క్యాబినెట్ లో మంత్రులకు ఇప్పటికే ఈ విషయాన్ని తెలియజేశారు.

 కాగిత రహిత క్యాబినెట్ సమావేశాన్ని 2017 లోనూ చంద్రబాబు( Chandrababu Naidu ) ప్రారంభించారు.27 న నిర్వహించబోయే సమావేశం కూడా అదే మాదిరిగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు .ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ట్యాబ్ ల ద్వారా క్యాబినెట్ నిర్వహించాలని నిర్ణయించారు.

టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యం ఎప్పుడు చంద్రబాబు ఇస్తూనే ఉంటారు.పార్టీలోనూ ప్రభుత్వంలోనూ డిజిటల్ టెక్నాలజీని ప్రవేశ పెడుతూ వినూత్నంగా ముందుకు వెళుతూ ఉంటారు .ఇక ఈనెల 27న నిర్వహించబోతున్న క్యాబినెట్ సమావేశంలో ఏపీకి సంబంధించి అనేక కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు.

ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలైన సూపర్ సిక్స్ పథకాలతో పాటు , మిగతా సంక్షేమ పథకాల అమలు విషయంలో అనేక విమర్శలు వస్తుండడం, ప్రధానంగా వైసిపి వీటిపైనే మీడియా,  సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ అబాసపాలు చేస్తుండడం ప్రజల్లోనూ వీటికి సంబంధించిన చర్చ జోరుగా జరుగుతుండడంతో , ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు.వీటితో పాటు అమరావతి,  పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన  అంశాలతో పాటు, ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులను ఆకర్షించే అంశం పైనా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube