న్యూస్ రౌండర్ టాప్ 20

1.నేడు ఈడీ విచారణకు ఎంపీ నామా

నేడు ఈడీ విచారణకు ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరుకానున్నారు.
 

2.26 తో ముగియనున్న ‘ స్మైల్ ‘ దరఖాస్తు గడువు

  కేంద్ర ప్రభుత్వం స్మైల్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగియనుంది.కరోనా కారణంగా కుటుంబ యజమాని చనిపోతే, అతడి కుటుంబానికి బీసీ కార్పొరేషన్ ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ఆర్థిక సహాయం అందిస్తుంది.
 

3.చీఫ్ సెక్రటరీ జైలుకు పంపుతాం : ఏపీకి ఎన్జీటీ హెచ్చరిక

  రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఎన్జీటీ లో ఈ రోజు విచారణ జరిగింది.పనులను నిలిపివేయాలని ఎన్జీటీ గతంలో తీర్పు ఇచ్చినా, ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ వాసి గరిమళ్ల శ్రీనివాస్ పిటిషన్ వేయగా, తీర్పును దిక్కరించి పనులు కొనసాగిస్తే చీఫ్ సెక్రటరీ జైలుకు పంపుతామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హచ్చరించింది.
 

4.కోవిడ్ నియంత్రణ చర్యలు పై హైకోర్టులో విచారణ

  కువైట్ నియంత్రణ చర్యలు పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

ప్లాంట్ల నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.రాష్ట్రాల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ కేసులు సరఫరా వివరాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

5.దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి

Telugu America, Appalaraju, Jagan, Nama Nageswarao, Gold, Top, Vaccine, Durai Mu

  మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ చట్టం దిశ యాప్ తీసుకువచ్చిందని హోంమంత్రి సుచరిత తెలిపారు.ప్రతి ఒక్కరు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె కోరారు.
 

6.స్టీల్ ప్లాంట్ కోసం 134 రోజులుగా దీక్షలు

  స్టీల్ ప్లాంట్ కోసం 134 రోజులుగా దీక్ష చేస్తున్నామని పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ తెలిపారు.
 

7.నా పోరాటం శివసేన పైనే : ఎంపీ నవనీత్ కౌర్

Telugu America, Appalaraju, Jagan, Nama Nageswarao, Gold, Top, Vaccine, Durai Mu

  ఓటమి అక్కసుతోనే శివసేన అభ్యర్థి తన పై అక్రమ కేసులు పెట్టారని హైకోర్టులో చుక్కెదురైంది సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది తన పోరాటం శివసేన పైనే అని ఎంపీ నవనీత్ కౌర్ తిరుమల వచ్చిన సందర్భంగా వ్యాఖ్యానించారు.
 

8.పన్నులపై జగన్కి రఘురామ లేఖ

  ఏపీ సీఎం వైయస్ జగన్ కు rebel mp రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు.నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో ఆయన లేఖ సంధించారు.చెత్త సహా రాష్ట్రంలో విధించిన వివిధ పనులపై ఆ లేఖలో ప్రస్తావించారు.
 

9.ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల రద్దు పై నేడు విచారణ

Telugu America, Appalaraju, Jagan, Nama Nageswarao, Gold, Top, Vaccine, Durai Mu

  ఎం పి టి సి జెడ్ పి టి సి ఎన్నికల రద్దు పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
 

10.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది.గురువారం స్వామి వారిని 17,744 మంది భక్తులు దర్శించుకున్నారు.
 

11.ఆర్డీఎస్ కు భారీ భద్రత

Telugu America, Appalaraju, Jagan, Nama Nageswarao, Gold, Top, Vaccine, Durai Mu

  ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ పనులు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆనకట్ట వద్ద భారీ భద్రతను ఏపీ ప్రభుత్వం చేపట్టింది.
 

12.ఇండియా అమెరికా నేవీ సంయుక్త విన్యాసాలు

  భారత , అమెరికా నౌకా దళాలు హిందూ మహాసముద్రంలో గురువారం సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి.
 

13.22 మంది డీఎస్పీల బదిలీ

Telugu America, Appalaraju, Jagan, Nama Nageswarao, Gold, Top, Vaccine, Durai Mu

  ఏపీలో 22 మంది డీఎస్పీల ను ప్రభుత్వం బదిలీ చేసింది.
 

14.మంత్రి అప్పల రాజు పై ఫిర్యాదు

  నిబంధనలు పాటించకుండా వజ్రపుకొత్తూరు కేంద్ర కార్యాలయం ఆవరణలో వైఎస్సార్ చేయూత భారీ బహిరంగ సభ నిర్వహణపై రాష్ట్ర మంత్రి అప్పలరాజు వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ టిడిపి నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
 

15.చెట్టు మీద పడి ఏనుగు మృతి

Telugu America, Appalaraju, Jagan, Nama Nageswarao, Gold, Top, Vaccine, Durai Mu

  బెంగళూరు శివారు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వీచిన ఈదురు గాలులు దెబ్బకు బన్నేరుఘట్ట లో చెట్టు కూలడంతో 40 సంవత్సరాల వయసున్న ఏనుగు మృతి చెందింది.
 

16.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

17.హంపి సందర్శనకు అనుమతి

Telugu America, Appalaraju, Jagan, Nama Nageswarao, Gold, Top, Vaccine, Durai Mu

  దక్షిణ కాశీ గా పేరుపొందిన హంపి పుణ్యక్షేత్రం దర్శనానికి దేవాదాయశాఖ భారతీయ పురాతత్వ శాఖ అనుమతి ఇచ్చింది.
 

18.కావేరి గోదావరి అనుసంధానం చేస్తాం

  తమ ప్రభుత్వ హయాంలో గోదావరి కావేరీ నదుల అనుసంధానం చేస్తామని తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురై మురుగన్ తెలిపారు.
 

19.కోవేట్ నివారణ చర్యలపై జగన్ సమీక్ష

Telugu America, Appalaraju, Jagan, Nama Nageswarao, Gold, Top, Vaccine, Durai Mu

  కోవిడ్ నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో  సమీక్ష చేపట్టారు.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,200   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,200.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube