సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వెళ్లాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ముఖ్యంగా సెలబ్రెటీలు బయటకు వస్తున్నారని తెలిసి ఎంతో మంది అభిమానులు వారిని చూడటం కోసం వారితో ఫోటోలు దిగడం కోసం ఎగబడుతూ ఉంటారు.
అయితే నా అభిమానుల నుంచి వారిని వారు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వారికి ఎంతో నమ్మకమైనటువంటి వారిని బాడీగార్డ్స్( Body Guards ) గా నియమించుకుంటూ ఉంటారు.ఇలా వీరి పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉండి వారిని తమ సొంత ఫ్యామిలీ లాగా సెలబ్రిటీలు ట్రీట్ చేస్తూ ఉంటారు.
సెలబ్రిటీలకు బాడీగార్డ్స్ గా వ్యవహరించే వారి రెమ్యూనరేషన్( Remuneration ) కూడా భారీ స్థాయిలో ఉంటుంది.వారికి ఏకంగా ఒక కంపెనీ సీఈఓ స్థాయిలో జీతాలు ఇస్తూ నమ్మకంగా వారి వద్ద ఉంచుకుంటూ ఉంటారు.అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ నటి, ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) సతీమణి అనుష్క శర్మ( Anushka Sharma ) బాడీగార్డ్ శాలరీకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అనుష్క శర్మ వద్ద ప్రకాష్ సింగ్ అక్తా సోను ( Prakash singhe aktha sonu ) అనే బాడీగార్డ్ ఉన్నాడు.
అతడు చాలా సంవత్సరాలుగా అనుష్కకు నమ్మకమైన వ్యక్తి. ఇక ఈయన అనుష్క శర్మతో పాటు విరాట్ కోహ్లీకి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ వారికి ఎంతో ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు.
ఇలా వారి వద్ద ఎంతో నమ్మకంగా సోను వార్షిక వేతనం రూ.1.2 కోట్లు.అతని సంపాదన దేశంలోని చాలా మంది టాప్ CEOల ప్యాకేజీలను మించి ఉంటుందనీ తెలుస్తుంది.
అనుష్క శర్మకు మాత్రమే కాకుండా విరాట్ కోహ్లీకి కూడా ఈయన బాడీగార్డ్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.ఇక విరాట్ అనుష్క ఇద్దరు కూడా 2017 వ సంవత్సరంలో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు వామికా ( Vamika ) అనే అమ్మాయితో పాటు అకాయ్ ( Akaay ) అనే కుమారుడు కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇక పిల్లలు పుట్టిన తర్వాత అనుష్క శర్మ చాలా వరకు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.