ఇండియన్‌ అమ్మాయిల్లా కాదు.. నేను చాలా హాట్‌ గురూ అంటోంది

‘మజ్ను’ చిత్రంలో నానికి జోడీగా నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అను ఎమాన్యూల్‌ మొదటి చిత్రంతోనే తన అందంతో అలరించింది.ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా కూడా అనుకు మాత్రం మంచి ఆఫర్లు వచ్చాయి.

 Anu Emmanuel On About Her Body Language-TeluguStop.com

అయితే అదృష్టం కలిసి రాలేదో మరేంటో కాని ఈమెకు వచ్చిన పవర్‌స్టార్‌ మూవీ ‘అజ్ఞాతవాసి’ మరియు స్టైలిష్‌ స్టార్‌ మూవీ ‘నా పేరు సూర్య’ చిత్రాలు నిరాశ పర్చాయి.ఆ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో అను ఆశలన్నీ అడియాశలు అయ్యాయి.

ఆ రెండు చిత్రాలు సక్సెస్‌ అయితే అను ఎమన్యూల్‌ ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా కోటికి పైగా పారితోషికం తీసుకునేది.అవి ఫ్లాప్‌ అవ్వడంతో ప్రస్తుతం ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం సక్సెస్‌ కోసం ఎదురు చూస్తుంది.

నాగచైతన్య హీరోగా నటించిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో అను పొగరుబోతు అమ్మాయిగా కనిపించబోతుంది.సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన అను ఎమాన్యూల్‌ తన బాడీలాంగ్వేజ్‌పై తానే కామెంట్స్‌ చేసుకుంది.తాను అమెరికాలో పుట్టి పెరిగిన కారణంగా ఇండియన్‌ అమ్మాయిల బాడీలాంగ్వేజ్‌కు, నా బాడీలాంగ్వేజ్‌కు చాలా తేడా ఉంటుంది.

ఇక్కడ అమ్మాయిలు కూర్చున్నట్లుగా, నడిచినట్లుగా నేను నడవలేను అంటూ చెప్పుకొచ్చింది.

నా నడక, బాడీలాంగ్వేజ్‌ సహజంగానే కాస్త హాట్‌గా ఉంటుంది.దాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.చాలా మంది నా నడక మరియు బాడీలాంగ్వేజ్‌ గురించి కామెంట్స్‌ చేస్తూ ఉంటారు.

నిజ జీవితంలో కూడా అంత హాట్‌గా బాడీలాంగ్వేజ్‌ను ప్రదర్శించాలా అంటూ ఉంటారు.కాని నాకు అది సహజ సిద్దంగా వచ్చింది.

నేను దాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను అంటూ ఎమాన్యూల్‌ తాజాగా చెప్పుకొచ్చింది.

‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విజయాన్ని సాధిస్తే తప్ప అను ఎమాన్యూల్‌ తెలుగులో కొనసాగడం కష్టంగా ఉంది.

చైతూ మూవీ విడుదల అయితేనే ఈమెకు ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్న ఈ నేచురల్‌ హాట్‌ బ్యూటీకి అది దక్కేనా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube