హీరో నానికి గండం.. 108 రోజులు బయటకు రాకూడదట!

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం అంటే సుందరానికి.ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

 Ante Sundaraniki Movie Release Date Out 2 Ante Sundaraniki Movie, Nani, Nazriya-TeluguStop.com

ఈ సినిమాలో హీరో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రీమా నజీమ్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే నాని అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

అంతే కాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇకపోతే నేడు నాని పుట్టినరోజు.

ఈ సందర్భంగా అంటే సుందరానికి చిత్రబృందం నానికి ముందస్తుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాని నటిస్తున్న తాజా చిత్రం నుంచి చిన్న గ్లింప్స్ ని విడుదల చేసింది.

ఈ సినిమాలో నాని ఒక అమాయకపు బ్రాహ్మణుడి గా కనిపించ బోతున్నాడు.

ఇక అందులో నా నిజజీవితంలో అన్ని గండాలు ఉన్నందువల్ల అతని కుటుంబ సభ్యులు ఎక్కువగా హోమాలు చేయిస్తూ ఉంటారు.ఇక వరుస హోమాలతో విసుగెత్తిపోయిన నాని బయటకు వెళ్తే ద్విచక్ర వాహన గండం, లీగల్ లోకి వెళితే జలగండం, నడిస్తే రోడ్డు గండం, కూర్చుంటే కుర్చీ గండం.

దీనమ్మ గండం అంటూ ఫ్యామిలీ పై ఫైర్ అవుతాడు నాని.తాజాగా విడుదల చేసిన ఆ వీడియోలో.

ఆ వాడి జాతక ప్రకారం బర్తడే హోమం జరిగిన 108 రోజుల వరకూ బయటకు రాకూడదు అని అన్నారు.అందుకే జూన్ 10న మిమ్మల్ని నవ్వించడానికి థియేటర్ కి వస్తున్నాం అంటూ చిత్ర బృందం సినిమా నుంచి చిన్న గ్లింప్స్ వీడియోనీ విడుదల చేసింది.

ఇకపోతే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇక తాజాగా విడుదల చేసిన ఈ వీడియోతో అంచనాలు మరింత పెరిగాయి.ఇక నాని అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube