ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేయడాన్ని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ..

ఆద్యాత్మిక వాతావరణం కలిగిన చంద్రగిరి( Chandragiri )ని.

రణరంగంగా మార్చవద్దని తుడా ఛైర్మెన్, చంద్రగిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రతిపక్ష నేతకు హితవు పలికారు.

తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద నామినేషన్ కోసం వచ్చిన తన తండ్రి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Chevireddy Bhaskar Reddy ) వాహనంపై దాడి చేయడాన్ని ఖండించారు.ఎన్నికల నిబందనలు అతిక్రమించి చేసిన దాడులను ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుని చర్యలు చేపట్టి, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

తిరుచానూరు కేంద్రంగా నామినేషన్ లో జరిగిన సంఘటనను నిరసిస్తూ భారీ కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో వైసిపి నాయకులు కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చంద్రగిరిలో చిత్తూరు సంస్కృతి వద్దు, చిత్తూరు దౌర్జన్యాలు.చంద్రగిరిలో వద్దు, రౌడీయిజం మాకొద్దు, ఆద్యాత్మిక క్షేత్రంలో ప్రశాంతత కావాలి.

Advertisement

అంటూ ఓ చేత్తో కొవ్వొత్తి, మరో చేతిలో ఫ్లకార్డు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి( Chevireddy Mohit Reddy ) మాట్లాడుతూ, చంద్రగిరి ప్రజలను చిల్లర రాజకీయాలతో బయపెట్టాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు.

నా నామినేషన్ ప్రక్రియలో 50 వేల మందికి పైగా ప్రజలు తరలిరావడంతో ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారనిఆరోపించారు.ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసి తద్వారా పార్టీ కేడర్ ను నీరుగార్చే ప్రయత్నం ఫలించదని సూచించారు.

చిత్తూరు నుంచి వచ్చిన అల్లరిమూకలు మాత్రమే దాడికి తెగబడ్డారని తెలిపారు.ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు అధికారులు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు.

ఇందులో పోలీసు అధికారుల నిర్లక్ష్యం ఉందని దీనిపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు మోహిత్ రెడ్డి.

మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!
Advertisement

తాజా వార్తలు