అమెరికాలో రైలు ప్రమాదం.. తెలుగు వ్యక్తి దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో విషాదఛాయలు

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.రైలు ప్రమాదంలో భారతీయుడు దుర్మరణం పాలయ్యాడు.

 Andhra Man Killed In Us Train Mishap , Srikanth, Us Train Mishap, Telugu Associa-TeluguStop.com

మృతుడిని శ్రీకాంత్ దిగాలాగా గుర్తించారు.ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా .గతవారం ప్రిన్స్‌టన్ జంక్షన్ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు.ఇతను న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివసిస్తున్నాడు.

ఆమ్‌ట్రాక్ రైలు 178 వాషింగ్టన్ నుంచి బోస్టన్‌కు వెళ్తుండగా.శ్రీకాంత్ ప్రిన్స్‌టన్ జంక్షన్‌కు తూర్పువైపున ప్రమాదానికి గురయ్యాడని ఆమ్‌ట్రాక్ ప్రతినిధి డైలీ వాయిస్ వార్తాసంస్థకు తెలిపారు.

శ్రీకాంత్ దిగాలాకు భార్య, పదేళ్ల కుమారుడు వున్నారు.కుటుంబానికి అతనే జీవనాధారం కావడంతో అతని కుటుంబానికి సహాయం చేయడానికి గో ఫండ్ మీ పేజీ ద్వారా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు . తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)తో పాటు అనేక ప్రవాస భారతీయ సంఘాలు శ్రీకాంత్ కుటుంబానికి సాయం చేసేందుకు రంగంలోకి దిగాయి.అలాగే అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

మరోవైపు శ్రీకాంత్ మరణవార్తతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Telugu Nationalsafety, York, Reva Gupta, Roma Gupta, Srikanth, Telugu America, T

ఇదిలావుండగా.అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారత సంతతి మహిళ దుర్మరణం పాలైంది.ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె కుమార్తె పరిస్ధితి విషమంగా వుంది.

వివరాల్లోకి వెళితే.అమెరికాలో స్థిరపడిన రోమా గుప్తా (63), ఆమె కుమార్తె రీవా గుప్తా (33)లు ఆదివారం ఓ చిన్న విమానంలో ప్రయాణిస్తున్నారు.

ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న విమానం న్యూయార్క్ నగర పరిధిలోని లాంగ్ ఐల్యాండ్ హోమ్స్ సమీపంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది.రిపబ్లిక్ ఎయిర్‌పోర్టుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Telugu Nationalsafety, York, Reva Gupta, Roma Gupta, Srikanth, Telugu America, T

ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని రోమా ప్రాణాలు కోల్పోగా.రీవా , ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ (23) తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసి.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి.ప్రస్తుతం రీవా, పైలట్ ఇన్‌స్ట్రక్టర్‌లు స్టానో బ్రూక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.రీవా గుప్తా మౌంట్ సినాయ్ సిస్టమ్‌లో ఫిజిషీయన్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.

ఈ ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో పాటు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సైతం దర్యాప్తు ప్రారంభించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube