రాజకీయాల్లో కొన్ని ఘటనలు అందరినీ ప్రభావితం చేస్తాయి.అయితే అవి మంచికా చెడుకా అన్నది పక్కన పెడితే అప్పటి దాకా సైలెంట్ గా ఉన్న నేతలను, కార్యకర్తలను కూడా ఒక్క తాటిమీదకు తెచ్చేస్తాయి.
అప్పటి వరకు ఉన్న విభేదాలను పక్కన పడేసేలా చేస్తాయి.కారణాలు ఏమైనా కూడా ఇలాంటి పరిణామాల వల్ల ప్రతి ఒక్కరూ ఫుల్ యాక్టివ్ అయిపోతుంటారు.
ఇప్పుడు వైసీపీ, టీడీపీలో కూడా ఇదే జరుగుతోంది.ఈ పార్టీల్లో ఇప్పుడు అందరూ ఫుల్ యాక్టివ్ గా ఢీ అంటే ఢీ అన్నట్టు మాటల తూటాలు విసురుతున్నారు.
ఇక కేడర్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏకంగా దాడులకు దిగిపోతున్నారు.ఇరు పార్టీల నేతలు చేసుకుంటున్న శృతి మించిన మాటలు రెండు పార్టీల్లోనూ అగ్గి రాజేస్తున్నాయి.కానీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు పార్టీలకు బాగానే హెల్ప్ అయ్యాయని చెబతున్నారు నిపుణులు.
ఎందుకంటే చాలా రోజులుగు ఏపీ రాజకీయాలు చప్పగా సాగుతున్నాయి.కానీ ఎప్పుడైతే వైసీపీలో మంత్రి పదవుల మార్పు అనే అంశం తెరమీదకు వచ్చిందో అప్పటి నుంచే ఆ పార్టీలో అందరూ చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు.

అప్పటి దాకా మీడియాలో కూడా కనిపించని వారు సైతం డైరెక్టుగా చంద్రబాబుపై విమర్శలు చేసేస్తున్నారు.ఇక టీడీపీలో కొందరు రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తమ వాయిస్ బలంగా వినిపించాలనే ఉత్సాహంతో జగన్‌ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసేస్తున్నారు.దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు భగ్గుమంటున్నారు.ఇది ఆ రెండు పార్టీలకు బాగా కలిసి వస్తోంది.ఎందుకంటే ఎంత చెప్పినా రోడ్ల మీదకు రాని కార్యకర్తలు, సైలెంట్ గా ఉండి పోయిన నేతలు కూడా ఇప్పుడు ఫుల్ యాక్టివ్ గాకనిపిస్తున్నారు.ఏదేమైనా ఇలాంటి వ్యాఖ్యలు రెండు పార్టీలకు ఉపయోగపడుతున్నాయన్న మాట.