Rahul Ravindran : రాహుల్ పోస్ట్ పై స్పందిచిన అనసూయ.. ఐ డోంట్ కేర్ అంటూ?

భగవంత్ సినిమా కేసరి చూసిన ప్రతి ఒక్కరికి ఆ సినిమాలో గుడ్‌ టచ్‌.బ్యాడ్‌ టచ్‌ అనే డైలాగు గుర్తుండే ఉంటుంది.

 Rahul Ravindran : రాహుల్ పోస్ట్ పై స్పంద�-TeluguStop.com

ఈ డైలాగ్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసిన విషయం తెలిసిందే.ఇలాంటి మంచి సన్నివేశాన్ని పెట్టినందుకు చిత్ర బృందంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్‌( Rahul ravindran ) ఈ డైలాగ్‌పై తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్‌ పెట్టారు.కాగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ స్పందించారు.

Telugu Anasuya, Balakrishna, Kajal Agarwal, Rahul Ravindran, Sreeleela, Tollywoo

ఆ పోస్ట్ లో భగవంత్ కేసరిలో( Bagavanth kesari ) అద్భుతమైన డైలాగుతో ప్రజలను చైతన్యవంతులను చేశారు.బాలకృష్ణ( Balakrishna) చిత్రం కాబట్టి వారం రోజుల్లోనే ఆ సందేశం ప్రజల్లోకి వెళ్లింది.ఇతర మీడియా ద్వారా అయితే 10 ఏళ్లు పట్టేది.మాస్‌ మసాల సినిమాలోనూ ఇలాంటి గొప్ప మెసేజ్‌ను పెట్టినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు.బాలకృష్ణ వల్ల మాత్రమే ఇది సులభంగా సాధ్యమైంది.అత్యంత ప్రభావవంతమైన పద్ధతిలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ఇక ఈ సినిమాలో కాజల్‌ ఎప్పుడూ లేనంత స్టైలిష్‌గా కనిపించింది అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు రాహుల్ రవీంద్రన్.ఆ పోస్ట్ పై స్పందించిన అనసూయ.

Telugu Anasuya, Balakrishna, Kajal Agarwal, Rahul Ravindran, Sreeleela, Tollywoo

ఈ సినిమా గురించి ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు.నా మనసులో ఉన్న మాటలనే మీరు చెప్పారు. బాలకృష్ణ( Balakrishna ) చెప్పిన చాలా డైలాగులు నేను ఇన్‌స్టా కోట్స్‌లో వాడాలనుకుంటున్నాను.వాటిని ఎప్పటికీ మర్చిపోకూడదు.ఎందుకంటే ఐ డోంట్‌ కేర్‌ అంటూ అనిల్ రావిపూడిని ట్యాగ్‌ చేశారు.ప్రస్తుతం వీరి సంభాషణ ఆకట్టుకుంటోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య బాబు హీరోగా నటించగా కాజల్ అగర్వాల్ ( kajal agarwal )న్ గా నటించిన విషయం తెలిసిందే.ఇందులో శ్రీ లీల ( Sreeleela )బాలయ్య కూతురి పాత్రలో నటించింది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube