గూగుల్ పే లో చిరు వ్యాపారులు రూ.1లక్ష వరకు రుణం పొందే అవకాశం..!

యూపీఐ పేమెంట్స్( UPI Payments ) సంస్థలు యూజర్లను అట్రాక్ట్ చేయడం కోసం లోన్ యాప్స్ ద్వారా రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే.కోన్ని ఫైనాన్స్ సంస్థల భాగస్వామ్యంతో యూపీఐ యాప్స్ అప్పులు ఇచ్చి యూజర్లను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నాయి.

 Small Traders Can Get A Loan Of Up To Rs. 1 Lakh In Google Pay , Google Pay ,s-TeluguStop.com

తాజాగా గూగుల్ పే కూడా యూజర్లను ఆకట్టుకోవడం కోసం చిరు వ్యాపారులకు లోన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.గూగుల్ మేడ్ ఫర్ ఇండియా తొమ్మిదో ఎడిషన్ లో ఈ విషయాన్ని ప్రకటించింది.

Telugu Dmi, Google, Google Pay, Small Traders, Upi-Technology Telugu

చిరు వ్యాపారులు గూగుల్ పే( Google Pay ) లో చాలా సులభమైన పద్ధతులలో రుణాలను పొందవచ్చు.తీసుకున్న రుణాన్ని నచ్చిన నెలవారి మొత్తంలో చెల్లించుకునే అవకాశం కూడా గూగుల్ ప్రత్యేకంగా కల్పించింది.గూగుల్ పే DMI ఫైనాన్స్( DMI Finance ) తో కలిసి సాచెట్ లోన్ పేరుతో అప్పులు ఇవ్వనుంది.గూగుల్ పే ప్రీ అప్రూవ్డ్ లోన్ పేరుతో రుణాలు ఇవ్వనుంది.

అంటే తక్కువ మొత్తం, తక్కువ కాల వ్యవధి రుణాలు అన్నమాట.చిరు వ్యాపారులు రూ.10000 నుంచి రూ.100000 వరకు యాప్ లో అప్పు పొందవచ్చు.అప్పును ఏడు రోజుల నుంచి 12 నెలల లోపు వాయిదా పద్ధతుల్లో చెల్లించవచ్చు.

Telugu Dmi, Google, Google Pay, Small Traders, Upi-Technology Telugu

గూగుల్ పే యాప్ లేదా వెబ్సైట్ ద్వారా చాలా సులభమైన స్టెప్స్ తో ఈ రుణాన్ని చిరు వ్యాపారులు పొందవచ్చు.ఈఎంఐ నెలకు ఎంత కట్టాలో వినియోగదారులే తమకు నచ్చిన ఆప్షన్ ను ఎంచుకునే వెసులుబాటు గూగుల్ పే కల్పించింది.కాకపోతే 12 నెలల లోపు మొత్తం అప్పు చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీ రేట్లు కూడా మిగతా లోన్ యాప్స్ తో పోలిస్తే చాలా తక్కువ.నెలవారి ఆదాయం రూ.30 వేలు ఉన్నవారు లోన్ పొందేందుకు అర్హులు అని గూగుల్ తెలిపింది.అయితే ముందుగా టైర్ 2 సిటీల్లో గూగుల్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

త్వరలోనే గ్రామాలలో కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube