గూగుల్ పే లో చిరు వ్యాపారులు రూ.1లక్ష వరకు రుణం పొందే అవకాశం..!

యూపీఐ పేమెంట్స్( UPI Payments ) సంస్థలు యూజర్లను అట్రాక్ట్ చేయడం కోసం లోన్ యాప్స్ ద్వారా రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే.

కోన్ని ఫైనాన్స్ సంస్థల భాగస్వామ్యంతో యూపీఐ యాప్స్ అప్పులు ఇచ్చి యూజర్లను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నాయి.

తాజాగా గూగుల్ పే కూడా యూజర్లను ఆకట్టుకోవడం కోసం చిరు వ్యాపారులకు లోన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

గూగుల్ మేడ్ ఫర్ ఇండియా తొమ్మిదో ఎడిషన్ లో ఈ విషయాన్ని ప్రకటించింది.

"""/" / చిరు వ్యాపారులు గూగుల్ పే( Google Pay ) లో చాలా సులభమైన పద్ధతులలో రుణాలను పొందవచ్చు.

తీసుకున్న రుణాన్ని నచ్చిన నెలవారి మొత్తంలో చెల్లించుకునే అవకాశం కూడా గూగుల్ ప్రత్యేకంగా కల్పించింది.

గూగుల్ పే DMI ఫైనాన్స్( DMI Finance ) తో కలిసి సాచెట్ లోన్ పేరుతో అప్పులు ఇవ్వనుంది.

గూగుల్ పే ప్రీ అప్రూవ్డ్ లోన్ పేరుతో రుణాలు ఇవ్వనుంది.అంటే తక్కువ మొత్తం, తక్కువ కాల వ్యవధి రుణాలు అన్నమాట.

చిరు వ్యాపారులు రూ.10000 నుంచి రూ.

100000 వరకు యాప్ లో అప్పు పొందవచ్చు.అప్పును ఏడు రోజుల నుంచి 12 నెలల లోపు వాయిదా పద్ధతుల్లో చెల్లించవచ్చు.

"""/" / గూగుల్ పే యాప్ లేదా వెబ్సైట్ ద్వారా చాలా సులభమైన స్టెప్స్ తో ఈ రుణాన్ని చిరు వ్యాపారులు పొందవచ్చు.

ఈఎంఐ నెలకు ఎంత కట్టాలో వినియోగదారులే తమకు నచ్చిన ఆప్షన్ ను ఎంచుకునే వెసులుబాటు గూగుల్ పే కల్పించింది.

కాకపోతే 12 నెలల లోపు మొత్తం అప్పు చెల్లించాల్సి ఉంటుంది.వడ్డీ రేట్లు కూడా మిగతా లోన్ యాప్స్ తో పోలిస్తే చాలా తక్కువ.

నెలవారి ఆదాయం రూ.30 వేలు ఉన్నవారు లోన్ పొందేందుకు అర్హులు అని గూగుల్ తెలిపింది.

అయితే ముందుగా టైర్ 2 సిటీల్లో గూగుల్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

త్వరలోనే గ్రామాలలో కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.