పిల్లాడిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. చెస్ గ్రాండ్ మాస్టర్ అవుతాడని కితాబు

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తరచూ పోస్ట్ చేసే వీడియోలు ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటాయి.నెటిజన్లలో ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి.

 Anand Mahindra Praises Book That He Will Become A Chess Grandmaster ,anand Mahin-TeluguStop.com

మండే మోటివేషన్ పేరుతో ఆయన తరచూ కొన్ని పోస్టులు చేస్తుంటారు.తాజాగా చెస్ పోటీలకు హాజరైన ఓ బాలుడి ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.

చెస్ పోటీ కోసం రాత్రంతా ప్రయాణించి, మ్యాచ్‌కు ముందు బోర్డు ముందు కుర్చీలో కూర్చుని కునుకు తీస్తున్న బాలుడు అందులో ఉన్నాడు.తమిళనాడులోని హోసూర్‌లో జరిగిన స్కూల్ చెస్ పోటీకి 1600 మంది పిల్లలు హాజరవుతున్నారు.

ఆనంద్ మహీంద్రా ఆ బాలుడిని ప్రశంసించారు.ఆ బాలుడు తదుపరి మాగ్నస్ కార్ల్‌సెన్‌గా అవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

ఇటీవల హోసూర్‌లో స్కూల్ చెస్ పోటీలు చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.దానికి చుట్టు పక్కల ప్రాంతాల నుండి 1600 మంది పిల్లలు పోటీలకు హాజరయ్యారు.ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఫొటోలో పిల్లవాడు రాత్రంతా బస్సులో ప్రయాణించాడు.పైగా రెండు చోట్ల బస్సు మారాడు.తర్వాత చెస్ పోటీలు జరుగుతున్న ప్రదేశానికి ఆ బాలుడు వచ్చాడు.మ్యాచ్‌కు ముందు కొద్దిసేపు సమయం దొరికింది.

దీంతో ఆ సమయాన్ని బాలుడు సద్వినియోగం చేసుకున్నాడు.మ్యాచ్ ముందు కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.

కుర్చీలోనే కునుకు తీశాడు.ఆ బాలుడిని ఆనంద్ మహీంద్రా ప్రశంసల్లో ముంచెత్తాడు.

ఇలాంటి పిల్లలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తారని, అతడు నా ప్రేరణ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నాడు.ఆ బాలుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

చెస్ పట్ల ఆ బాలుడికి ఉన్న అంకితభావాన్ని పలువురు కొనియాడారు.అతడు ఖచ్చితంగా భవిష్యత్తులో చెస్ గ్రాండ్ మాస్టర్ అవుతాడని అభినందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube