దుబాయ్ లో ఘోరం...రూమ్ మేట్ ని చంపిన భారతీయుడు

మద్యం మత్తులో ఎన్ని అనర్ధాలు జరుగుతాయో ఎన్నో సంఘటనలు వెలుగు చూసినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు.స్వానుభవం అయ్యే సరికి ఎంతో ఘోరమైన నేరాలకి పాల్పడి జైలు ఊచలు లెక్కించే దుస్థితి పడుతుంది…ఇలాంటి ఘటనే దుబాయ్ లో ఓ భారతీయుడికి ఎదురయ్యింది…ఒక వ్యక్తిని కత్తితో పొడిచిన కారణంగా అతడు ఇప్పుడు పరారీలో ఉన్నాడని దుబాయ్ పోలీసులు తెలిపారు వివరాలలోకి వెళ్తే.

 An In Indian Nri Mysterious Missing In Dubai-TeluguStop.com

భవన నిర్మాణ పని నిమ్మిత్తం దుబాయ్ వెళ్ళిన భారత వలస కార్మికుడు అక్కడ మరొక వ్యక్తితో కలిసి ఒక గదిలో ఉంటున్నాడు.ఒక రోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.అప్పటికే వ్యక్తి ఫుల్‌గా తాగి ఉన్నాడు.ఇద్దరి మధ్య చిన్న గొడవ చోటు చేసుకుంది…ఇది జరిగిన కాసేపటికే సదరు భారత సంతతి వ్యక్తి వెంటనే కత్తి తీసుకుని మరో వ్యక్తిని పొడిచి హత్య చేశాడు ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం.

అక్కడ ఒకే గదిలో ఉంటున్న వారి ఇరువురి మధ్య పెద్ద గొడవైందని చెప్పారు.అదే సమయంలో హత్యకు గురైన వ్యక్తి మరెవరికో ఫోన్ చేసి గట్టిగా మాట్లాడుతూ ఉండగా భారత వ్యక్తి గట్టిగా మాట్లాడవద్దని వారించాడని అయితే మరో వ్యక్తి ఇవేమీ పట్టించుకోకుండా గట్టిగా మాట్లాడుతుండటంతో భరించలేకపోయిన వ్యక్తి అక్కడే ఉన్న కత్తి తీసుకుని రెండు పోట్లు పొడిచాడు.

దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు అయితే ఇద్దరి మధ్య అంతకుముందే మాటల యుద్ధం జరిగినట్లు మిగతా కార్మికులు మాట్లాడుకున్నారని సూపర్ వైజర్ చెప్పారు.

హత్య తరువాత భారత వలస జీవి అక్కడి నుంచీ మెల్లగా జారుకోవడం.హత్య చేసిన కత్తిని తన దిండు కింది దాచి చేతులని శుభ్రం చేసుకుని అక్కడి నుంచీ పరారయినట్టుగా తోటి కార్మికులు తెలిపారు.ఈ సంఘటనలు సీసీ టీవీ పుటేజ్ ద్వారా తెలిశాయని పోలీసులు ఈ పుటేజ్ ని పరిశీలించి కేసు ఫైల్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని.

అయితే అతడు దుబాయ్ లో ఎక్కడికి వెళ్ళే అవకశం లేదని త్వరలో అతడిని పట్టుకుని కోర్టులో హాజరు పరుస్తామని దుబాయ్ పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube