జ‌గ‌న్ మీద గేమ్ స్టార్ట్ చేసిన అమిత్ షా.. మ‌ద్ద‌తు కోస‌మేనా..?

ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కొత్త మిత్రుల కోసం వేట మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది.కేంద్రంలో మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే ఈ సారి ఉత్త‌రాది రాష్ట్రాల‌ను న‌మ్ముకునే కంటే కూడా ద‌క్షిణాది రాష్ట్రాల‌ను న‌మ్ముకోవాల‌ని డిసైడ్ అయిపోయింది.

 Amit Shah Who Started The Game On Jagan Is It For Support Jagan, Amit Shah-TeluguStop.com

ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల‌పై ఫోక‌స్ పెట్టింది.అయితే ఇటు తెలంగాణ‌లో ఎలాగూ బ‌ల‌ప‌డుతోంది కాబ‌ట్టి కేసీఆర్‌తో పొత్తు కంటే కూడా ఇప్పుడు జ‌గ‌న్‌తో పొత్తు పెట్టుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

త‌మ‌కు రాబోయే ఎన్నిక‌ల్లో స‌పోర్టు చేయాల‌ని అమిత్ షా అనుకుంటున్నారంట‌.

కానీ జ‌గ‌న్ మాత్రం కేంద్రంలో ఎవ‌రు ఉన్నా పెద్ద‌గా ప‌ట్టించుకునే ప‌రిస్థితులు లేవు.

ఇప్ప‌టికిప్పుడు చంద్ర‌బాబును ద‌రిదాపుల్లోకి రానీయ‌కుండా చూసుకోవ‌డ‌మే జ‌గ‌న్‌కు ఉన్న అతి పెద్ద ప‌ని.ఈ ప‌నిలోనే ఆయ‌న ఫుల్ ఫోక‌స్ పెడుతున్నారు.

అయితే ఇప్పుడు అమిత్ షా గేమ్ స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.జ‌గ‌న్ ను ఇర‌కాటంలో పెట్టి త‌మ దారిలోకి తెచ్చుకోవాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మొన్న తిరుప‌తికి వ‌చ్చిన‌ప్పుడే ఆయ‌న గేమ్ స్టార్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.అమ‌రావ‌తి రైతులుకు బీజేపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం కూడా ఇందులో భాగ‌మే.

Telugu Amit Shah, Amitshah, Ap Bjp, Ap, Ap Poitics, Chandra Babu, Jagan, Ysrcp-T

దీని త‌ర్వాత ఏపీకి 57 వేల కోట్ల అప్పు ఉందన్న విష‌యాన్ని పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు విమ‌ర్శించ‌డం, అలాగే అన్న‌మ‌య్య ప్రాజెక్టు గేట్ల‌కు గ్రీజు కూడా పూయ‌లేద‌ని అందుకే ఇన్ని మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని కేంద్ర మంత్రులు విమ‌ర్శించ‌డం అన్నీ కూడా అమిత్ షా ప్లాన్ లో భాగ‌మేన‌ని తెలుస్తోంది.ఇక పోల‌వ‌రం కూడా ఇరిగేషన్ కంపోనెంట్ కే నిధులు కేటాయిస్తామ‌ని చెప్ప‌డం కూడా ఇందులో భాగ‌మేన‌ని తెలుస్తోంది.ఇలా ఏపీకి ఇరకాటం తెచ్చి జగన్ కేంద్రానికి మద్దతు ఇచ్చేలా చెప్పించుకోవాల‌ని చూస్తున్నారు.మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో అన్న‌ది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube