సినిమా పరిశ్రమ అనేదే చాలా బిజీ పరిశ్రమ.రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉంటారు సినీ జనాలు.
ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్టు ప్రొడక్షన్ అంటూ నిత్యం బిజీ బిజీ.అయితే ప్రతి నెల సెకెండ్ సండే హాలీడే.
ఆ రోజు సినిమా షూటింగ్స్ ఉండవు.అలాంటి సమయంలో ఆయా సినీ తారలతో పాటు మిగతా సినిమా జనాలు కూడా తమకు నచ్చిన పనులు చేసుకునే వారు.
అలాగే నటుడు చంద్ర మోహన్ కు కూడా కొన్ని ఇష్టా ఇష్టాలు ఉండేవి.పేకాట, ఫ్రెండ్స్ తో డ్రింక్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేసేవాడు.
అదే సమయంలో తన ఇద్దరు కూతుర్లు మధురమీనాక్షి, బాలమాధవితో ఆడుకునే వాడు.క్యారమ్స్, బ్యాడ్మింటన్, చెస్ ఆడేవారు.
అప్పట్లో చంద్రమోహన్ బాగా బిజీ ఆర్టిస్టు.ఆయనను చూడ్డానికి ఆంధ్రా నుంచి ఎవరో ఒకరు వచ్చేవారు.
అలాగే ఆయా నిర్మాణ సంస్థల వాళ్లు కాల్ షీట్ల కోసం వచ్చేవారు.ఇంట్లో వాళ్లు చెప్పే సమాధానాలకు వచ్చిన వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసేవారు.
ఈ సమస్యల నుంచి పరిష్కారం కలిగించేందుకు ప్రయత్నించాడు చంద్రమోహన్.అందులో భాగంగా తన రోజు వారీ షెడ్యూల్ ను తన కూతురుతో ఓ బ్లాక్ బోర్డు మీద రాయించేవాడు.
దాన్ని ఇంటి ముందు పెట్టేవాడు.వచ్చిన వారు ఆ బోర్డు మీద ఉన్న వివరాలను తెలుసుకుని.
వెళ్లిపోయేవారు.ఇంట్లోవాళ్లతో పాటు.
వచ్చిన వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు.
అప్పట్లో చంద్ర మోహన్ మద్రాసులో ఉండేవాడు.సినిమా షూటింగు సందర్భంగా చాలా బిజీగా ఉండే చంద్రమోహన్.సెలవు రోజుల్లో బస్సుతో పాటు సైకిల్ మీద దగ్గర్లోని ఊర్లన్నీ తిరిగేవాడు.
శరీరానికి వ్యాయామం, మనసుకు ప్రశాంతత అని భావించి… చిన్న చిన్న టూర్లు వేసేవాడు.సైకిల్ మీదే వెళ్లి పలు రకాల పనులు చక్కబెట్టుకునేవాడు.
హాలీడే నాడు.తనకు అభిమానులు రాసిన ఉత్తరాలను చదివి.
సమాధానాలు రాసేవాడు.మొత్తంగా అప్పట్లో చక్కటి లైఫ్ ను లీడ్ చేసేవాడు చంద్రమోహన్.