ప్రపంచం గ్లోబల్ సిటీగా మారిన నేపథ్యంలో ఒక దేశంలో జరిగే ఆర్దిక , రాజకీయ పరిణామాలు మరో దేశంలో ప్రభావం చూపించే పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం.మరీ ముఖ్యంగా అమెరికాలో ( America ) జరిగే పరిణామాలు భారతదేశంలో మరింత ప్రత్యక్ష ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
మన మానవ వనరుల అధికంగా అమెరికాలో ఉండటంతో పాటు మన ఆర్థిక మూలాలు కూడా అమెరికాతో పెన వేసుకుని ఉండడంతో అమెరికా పరిణామాలను నిశితం గా పరిశీలించాల్సిన పరిస్థితుల్లో మన దేశం ఉంటుంది.ఇప్పుడు అక్కడ గరిష్ట రుణ పరిమితి బిల్( Debt Ceiling Limit ) అమెరికన్ చట్ట సభల్లో ఆమోదం పొందక పోవడం ప్రపంచ వ్యాప్త ఆందోళనకు కారణం అవుతుంది .అధికార డెమోక్రాట్లకు ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఈ విషయం పై జరుగుతున్న రచ్చను ప్రపంచ దేశాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి.ఈ విషయం మరో ఆర్థిక సంక్షోభానికి( Financial Crisis ) దారి తీసే అవకాశం ఉన్నందున అక్కడ జరిగే పరిణామాలు పతాక శీర్షికలు ఎక్కుతున్నాయి .
అసలేమిటీ డెట్ సీలింగ్ అంటే తెలుగు లో ఋణ పరిమితి . ప్రతి దేశం తమ పరిపాలన సంబంధమైన అవసరాల కోసం అప్పులు చేయటం సహజమైన విషయమే.పన్నుల ద్వారా వసూలు చేసే మొత్తం కాకుండా మరికొంత మొత్తం వివిధ మార్గాల ద్వారా అప్పులు చేస్తూ ఉంటారు అయితే అమెరికాలో అలా అప్పులు చేయడానికి ఒక పరిమితి ఉంది దానిని డెట్ సీలింగ్ లిమిట్ అని పిలుస్తారు.అమెరికాలో ఈ లిమిట్ 31.4 ట్రిలియన్ న్ డాలర్ గా ఉంది .అయితే ఈ జనవరి కే ఆ లిమిట్ ని దాటేసిన అమెరికా, కేవలం పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతో వ్యవహారాన్ని నడిపిస్తుంది అయితే ఋణ పరిమితి లిమిట్ ని పెంచకపోతే అప్పులు తీర్చే సామర్థ్యం తగ్గిపోయి ఖజానా ఖాళీ అయిపోయి డిఫాల్ట్ అయిపోతామని ట్రెజరీ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి .
అమెరికా దివాలా తీస్తే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశం ఉన్నందున ఇప్పుడు అక్కడ పరిస్థితులు చక్కబడాలని అందరూ కోరుకుంటున్నారు.బిల్ ఆమోదం పొందాలంటే అధికార డెమోక్రట్లతోపాటు ప్రతిపక్ష రిపబ్లికన్ల అంగీకారం కూడా కావాలి.అయితే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు కోత విధిస్తేనే రుణ పరిమితి పెంపుకు అంగీకరిస్తామని రిపబ్లికన్లు పట్టుపడుతున్నారు.ఎలక్షన్లు దగ్గరలో ఉన్నందున సంక్షేమ పథకాలకు కోత విదిస్తే అధికారం మరొకసారి అధికారం దక్కదని జో బైడెన్ ప్రభుత్వం భావిస్తున్నందున ప్రతిపక్షం విధిస్తున్న షరతులకు అంగీకరించడం లేదు…… మరి అక్కడ రాజకీయ కారణాలతో ఈ బిల్లు ఆమోదం జరగకపోతే ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు భరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ సమస్య తొందరలో తొలగిపోవాలని అమెరికన్ లతో పాటు ప్రపంచ వ్యాప్త ఆర్థిక నిపుణులు కూడా కోరుకుంటున్నారు.