అమెరికా( America ) ఆర్ధిక పరిస్థితి గురించి మనం రోజూ వింటూ వున్నాం.అవును, ఇపుడు డాలర్ల రాజ్యం ఆర్ధిక మాంద్యంతో లాబోదిబోమని అంటోంది.
ప్రపంచం మీద పెత్తనం చెలాయించే అగ్రరాజ్యం ఇప్పుడు అప్పుల కుప్పగా మారింది.ఈ క్రమంలో కేవలం అమెరికా మాత్రమే దాని ప్రతిఫలాన్ని అనుభవించదు.
వాస్తవానికి అమెరికా ఆర్ధిక పరిస్థితి ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక పరిస్థితి( Financial situation )ని కూడా ప్రభావితం చేయడం అనివార్యం.
ఎందుకంటే ఇక్కడ చాలాదేశాలు తమ వ్యాపారాలను డాలర్లలోనే చేస్తుంటాయి.అందుకే ఆ సమస్య ఇపుడు ఇండియాకి కూడా పట్టుకుంది.అమెరికా ఆర్థిక వ్యవస్థ విలువ 23 లక్షల కోట్ల డాలర్లు కాగా ఇప్పుడు లోటు బడ్జెట్లో నడుస్తుండడం కొసమెరుపు.
అంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి కంటే చేసే ఖర్చు ఎక్కువగా ఉండడంతో లోటు బడ్జెట్లో కొనసాగుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులకోసం అమెరికా రుణ పరిమితిని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది.
దాంతో ఎంతోమంది ఆర్ధికంగా నష్టపోయిన పరిస్థితి.
అయితే, ఈ సమస్యకు త్వరలోనే ముగింపు కార్డు పడుతుందని అగ్రరాజ్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే పరిస్థితి భయానకంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా అమెరికాలోనే సెటిలై వున్నారు.
అది కూడా ఐటీ కంపెనీలలో.ఈ ప్రభావం తరువాత చాలామందికి ఉద్యోగాలలో( Jobs ) కోత విధించడం అనివార్యం.
దాంతో వారు తట్టాబుట్టా సర్దుకొని స్వదేశానికి రావలసిన పరిస్థితి వస్తుంది.మిగతా దేశాలతో పోలిస్తే మనవారికే ఎక్కువ నష్టం వాటిల్లనుంది.
ఐతే ఈ పరిస్థితి జరగవచ్చు, జరగకపోవచ్చని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.