గేమ్ స్టార్ట్..బిడెన్ కు ఇది అతిపెద్ద సవాల్..!!

అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయనేలేదు, వైట్ హౌస్ లోకి కాలు పెట్టనే లేదు మరో సారి కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ మొదలయ్యిపోయింది.కేవలం కరోనా కారణంగా అధికారంలోకి వచ్చిన బిడెన్ కు ఇప్పుడు అదే కరోనా పెను సవాలుగా నిలిచేలా ఉంది.

 Joe Biden Key Decision To Control Corona In America, America, Joe Biden, Corona-TeluguStop.com

అమెరికాలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ట్రంప్ లైట్ తీసుకున్నాడు, అదే సమయంలో కాస్త ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా, లేదంటే అమెరికన్స్ ను కరోనా విషయంలో అప్రమత్తం చేసి వ్యాధి ప్రభాలకుండా తగ్గించే ప్రయత్నాలు చేసినా అమెరికా అధ్యక్ష హోదా దక్కేది.అప్పటి అజాగ్రత్త ఫలితమే ఇప్పుడు ట్రంప్ కుర్చీకు ఎసరు పెట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రెండో సారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది.సెకండ్ వేవ్ ఇప్పటికే దాదాపు అన్ని దేశాలలో మొదలయ్యింది.అమెరికాలో కూడా సెకండ్ వేవ్ సీజన్ మొదలయ్యింది.దాంతో ముందస్తు చర్యలు చేపట్టే విధంగా అమెరికాలోని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్దమయ్యాయి.

ఈ క్రమంలోనే న్యూయార్క్ గవర్నర్ హెచ్చరికలు జారీ చేశారు.రాత్రి 10 గంటలకు బార్, రెస్టారెంట్, జిమ్, లు మూసేయాలని ఆదేశించారు.

మహమ్మారి మరింత ముదిరే అవకాశం ఉన్న నేపధ్యంలో సమావేశాలకు కేవలం 10 మంది మాత్రమే ఉండాలని తెలిపారు.అయితే

Telugu America, Corona Effect, Donald Trump, Joe Biden, Joebiden, Lockdown, York

ఆహార పదార్ధాల డెలివరీ విషయంలో ఎలాంటి ఆంక్షలు విధించలేదు.ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ కే పరిమితం చేయాలని, ఎక్కడా బహిరంగ సమావేశాలు నిర్వహించవద్దని పిలుపునిచ్చారు.తాజాగా పరిస్థితులు చూస్తుంటే అమెరికాలో కరోనా మహమ్మారి మరింతగా ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

ఇప్పటికి కరోనా వ్యాక్సిన్ రాకపోవడం, అలాగే రెండు రోజుల క్రితం విడుదలైన వ్యాక్సిన్ ప్రజలపై దుష్ప్రభావాన్ని చూపించడంతో తాజా పరిణామాలు బిడెన్ ప్రభుత్వానికి పెను సవాలుగా నిలువనున్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube