అమెజాన్ ఇండియా( Amazon India ) ఈ రోజు, భారతదేశ వ్యాప్తంగా 60కి పైగా నగరాలకు తన పూర్తి బాస్కెట్ గ్రోసరీ సేవను విస్తరిస్తున్నట్టు ప్రకటించింది.ఈ నేపథ్యంలో అమెజాన్ ఫ్రెష్( Amazon Fresh ) షోరూములను దేశవ్యాప్తంగా విస్తరించనుంది.
పండ్లు, కూరగాయలు, సౌందర్య, శిశు, శీతల ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, పెంపుడు జంతువులక ఉత్పత్తులతో సహా ఇతర రోజువారి కిరాణా సామాగ్రులుతో సహా అన్ని ఉత్పత్తులను దేశ ప్రజలకు ఒకేచోట అందుబాటులోకి తీసుకు రానుంది.
అవి ఏర్పాటు చేసిన నగరాల్లోని కస్టమర్లు అన్ని గ్రోసరీ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన సేల్స్ పొందుతారని చెబుతున్నారు.ఈ క్రమంలో ప్రతి నెల 1 నుండ 7వ తేదీ వరకు సూపర్ వాల్యూ డేస్,( Super Value Days ) తమకు కావలసిన సమయంలోనే డెలివరీని పొందే సౌకర్యం ద్వారా వాల్యూ ఆఫర్లను పొందవచ్చని తెలుస్తోంది.ఈ సందర్భంగా అమెజాన్ ఫ్రెష్ హెడ్ శ్రీకాంత్ శ్రీ రామ్ మాట్లాడుతూ… అమెజాన్ ఫ్రెష్, కస్టమర్లకు అనేక గృహ అవసరాలను అందించే వన్ స్టాప్ ఆన్లైన్ డెస్టినేషన్ అని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా మామిడిపండ్ల సీజన్ కనుక అనేక రకాల మామిడి పండ్లను కూడా విక్రయించనున్నారని తెలుస్తోంది.అంతేకాకుండా సీజనల్ ఫ్రూట్స్ కి ఇక్కడ పెద్దపీట వేయనున్నారు.ఇంకా ప్రజల ఆరోగ్యానికి అవసరమైన ఆర్గానిక్ ఫుడ్ ఇక్కడ లభిస్తుందని అంటున్నారు.కాబట్టి ఈ సదవకాశాన్ని జనులు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.ఇంకా ప్రతి MRP ధరపైన 10 శాతం తగ్గింపు ధరలు వుంటాయని తెలుస్తోంది.