అందాన్ని రెట్టింపు చేసి చూపించే వాటిలో జుట్టు ( Hair ) ఒకటి.అందుకే జుట్టును రకరకాలుగా స్టైలింగ్ చేస్తూ ఉంటారు.
అయితే మనలో కొందరికి జుట్టు చాలా పల్చగా ఉంటుంది.జుట్టు పల్చగా ఉండటం వల్ల ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోలేకపోతుంటారు.
పైగా పల్చటి జుట్టు మన లుక్ ను చెడగొడుతుంది.ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
థిక్ హెయిర్( Thick Hair ) కోసం మీరు కూడా ప్రయత్నిస్తున్నారా.? అయితే మీకు కాఫీ పౌడర్ ఉత్తమంగా సహాయపడుతుంది.
రెండు స్పూన్ల కాఫీ పొడి తో( Coffee Powder ) ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే రెండు నెలల్లో మీ జుట్టు రెండింతలు అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టుకు కాఫీ పొడిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వైట్ రైస్ ను( White Rice ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, ( Aloevera Gel ) అరకప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే అదిరిపోయే ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.
కాఫీ పౌడర్, రైస్, అలోవెరా జెల్, కొబ్బరి పాలు, ఆముదంలో ఎన్నో పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి.అవి జుట్టు ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుస్తాయి.జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.పల్చటి జుట్టు ఒత్తుగా మారేందుకు సహకరిస్తాయి.అలాగే ఈ రెమెడీ హెయిర్ ఫాల్ సమస్యను కూడా దూరం చేస్తుంది.జుట్టును సిల్కీగా స్మూత్ గా మారుస్తుంది.
డ్రై హెయిర్ సమస్య కూడా దూరం అవుతుంది.కాబట్టి ఒత్తైన ఆరోగ్యమైన జుట్టును కోరుకునే వారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.