చాలా మందికి శరీరం మొత్తం తెల్లగా ఉన్నా కూడా చేతులు, కాళ్లు మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటాయి.ఎండల ప్రభావం ఇందుకు ప్రధాన కారణంగా మారుతుంటుంది.
బయటకు వెళ్లేటప్పుడు ముఖాన్ని కవర్ చేసుకుంటారు.కానీ చేతులు, కాళ్లను పెద్దగా పట్టించుకోరు.
అందువల్ల ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి రక్షించేందుకు మన చర్మం మెలనిన్ విడుదల చేస్తుంది.ఈ కారణంగానే చర్మం నల్లగా తయారవుతుంది.
అయితే అలా నల్లగా మారిన కాళ్లు మరియు చేతులను మళ్లీ తెల్లగా మెరిసేలా చేయడానికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ లో తీసుకుని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్( Corn Flour ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ ను వేసుకోవాలి.
ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive oil ) మరియు వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు మరియు కాళ్లకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత హాఫ్ టమాటో( Tomato ) ని తీసుకుని చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.టమాటో బదులుగా మీరు లెమన్ ను కూడా యూస్ చేయవచ్చు.ఐదు నిమిషాల పాటు చేతులను కాళ్లను బాగా స్క్రబ్బింగ్ చేసుకుని ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా తడి లేకుండా కాళ్లు, చేతులు తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా కనుక చేశారంటే నల్లగా అసహ్యంగా కనిపిస్తున్న మీ చేతులు, కాళ్లు కొద్ది రోజుల్లోనే తెల్లగా మారతాయి.మెరిసిపోతూ అందంగా కనిపిస్తాయి.
అలాగే చేతులు కాళ్లు పై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.టాన్ రిమూవ్ అవుతుంది.
మరియు చేతులు, కాళ్లు మృదువుగా సైతం మారతాయి.