అమెజాన్ ఫ్రెష్ ఇపుడు మీ దగ్గరకి వచ్చేస్తోంది… దేశంలోని 60కి పైగా నగరాలకు!

అమెజాన్ ఇండియా( Amazon India ) ఈ రోజు, భారతదేశ వ్యాప్తంగా 60కి పైగా నగరాలకు తన పూర్తి బాస్కెట్ గ్రోసరీ సేవను విస్తరిస్తున్నట్టు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో అమెజాన్ ఫ్రెష్( Amazon Fresh ) షోరూములను దేశవ్యాప్తంగా విస్తరించనుంది.

పండ్లు, కూరగాయలు, సౌందర్య, శిశు, శీతల ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, పెంపుడు జంతువులక ఉత్పత్తులతో సహా ఇతర రోజువారి కిరాణా సామాగ్రులుతో సహా అన్ని ఉత్పత్తులను దేశ ప్రజలకు ఒకేచోట అందుబాటులోకి తీసుకు రానుంది.

"""/" / అవి ఏర్పాటు చేసిన నగరాల్లోని కస్టమర్లు అన్ని గ్రోసరీ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన సేల్స్ పొందుతారని చెబుతున్నారు.

ఈ క్రమంలో ప్రతి నెల 1 నుండ 7వ తేదీ వరకు సూపర్ వాల్యూ డేస్,( Super Value Days ) తమకు కావలసిన సమయంలోనే డెలివరీని పొందే సౌకర్యం ద్వారా వాల్యూ ఆఫర్లను పొందవచ్చని తెలుస్తోంది.

ఈ సందర్భంగా అమెజాన్ ఫ్రెష్ హెడ్ శ్రీకాంత్ శ్రీ రామ్ మాట్లాడుతూ.అమెజాన్ ఫ్రెష్, కస్టమర్లకు అనేక గృహ అవసరాలను అందించే వన్ స్టాప్ ఆన్లైన్ డెస్టినేషన్ అని చెప్పుకొచ్చారు.

"""/" / అంతేకాకుండా మామిడిపండ్ల సీజన్ కనుక అనేక రకాల మామిడి పండ్లను కూడా విక్రయించనున్నారని తెలుస్తోంది.

అంతేకాకుండా సీజనల్ ఫ్రూట్స్ కి ఇక్కడ పెద్దపీట వేయనున్నారు.ఇంకా ప్రజల ఆరోగ్యానికి అవసరమైన ఆర్గానిక్ ఫుడ్ ఇక్కడ లభిస్తుందని అంటున్నారు.

కాబట్టి ఈ సదవకాశాన్ని జనులు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.ఇంకా ప్రతి MRP ధరపైన 10 శాతం తగ్గింపు ధరలు వుంటాయని తెలుస్తోంది.

2026 సంవత్సరంలో చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ ఫైట్.. పైచేయి సాధించేది ఎవరో?