చాట్‌జీపీటీ లాంటి ఫీచర్లతో మరింత పవర్‌ఫుల్‌గా అమెజాన్ అలెక్సా..

అలెక్సా టీచర్ మోడల్ అని పిలిచే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)తో అమెజాన్ ( Amazon )తన వాయిస్ అసిస్టెంట్ అలెక్సాను పెద్దదిగా, మెరుగైనదిగా మార్చేందుకు కృషి చేస్తోంది.అలెక్సా సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి డిస్నీ, లెగో వంటి సంస్థలతో జాయింట్ వెంచర్‌లను కంపెనీ అన్వేషిస్తోంది.

 Amazon Alexa Is More Powerful With Features Like Chatgpt. Amazon, Alexa Teacher-TeluguStop.com

అలెక్సా టీచర్ మోడల్( Alexa teacher model ) ఎలా పనిచేస్తుందనేదానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, చిన్నారి పిల్లి, చంద్రుని గురించి బెడ్ టైమ్ స్టోరీ రూపొందించమని అలెక్సాను అడిగింది.

అలెక్సా అప్పుడు మిట్టెన్స్ అనే పిల్లి గురించి ఒక స్టోరీని సొంతంగా క్రియేట్ చేసింది.చంద్రునిపైకి వెళ్ళిన మొదటి పిల్లి జాతి అంటూ అలెక్స అద్భుతమైన కథ చెప్పింది.ఎకో షో కెమెరా ద్వారా ఫ్రోజెన్ నుంచి ఓలాఫ్ పాత్రను కూడా చేర్చింది.

అలెక్సా టీచర్ మోడల్ మరింత అధునాతన వెర్షన్లను అభివృద్ధి చేయాలని అమెజాన్ యోచిస్తోంది, ఇది అలెక్సాను మరింత చురుకైన, మరింత ఇంట్రాక్టివ్‌గా చేస్తుంది.ఈ అభివృద్ధి అలెక్సా కొంతకాలంగా ఉపయోగిస్తున్న ప్రస్తుత టీచర్ మోడల్‌కు భారీ అప్‌గ్రేడ్ అవుతుంది.మొత్తంమీద అధునాతన సామర్థ్యాలతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ల( Alexa Voice Assistant )ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి అమెజాన్ సిద్ధంగా ఉంది.అప్పుడు ఇది వినియోగదారులకు మరింత పవర్‌ఫుల్‌గా సాధనంగా మారుతుంది.

ఇకపోతే అమెజాన్ అలెక్సా అనేది రిమైండర్లను సెట్ చేయడం, సంగీతాన్ని ప్లే చేయడం, స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కంట్రోల్ చేయడం వంటి అనేక రకాల సర్వీసులను అందిస్తుంది.ఈ ప్రముఖ వాయిస్ అసిస్టెంట్ చాట్‌జీపీటీ లాంటి ఫీచర్లను పొందితే అది భవిష్యత్తులో వాయిస్ అసిస్టెంట్ మార్కెట్‌లో టాప్ ప్లేస్‌కి చేరుతుందని అనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube