అల్లుడికి అక్కడ కూడా అక్షింతలే!

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.ఈ సినిమాను దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాలో ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని ఆశించారు.

 Alludu Adhurs Trolled After Ott Release, Alludu Adhurs, Bellamkonda Sreenivas, O-TeluguStop.com

కానీ ఈ సినిమా రిలీజ్ తరువాత వారి అంచనాలను ఈ సినిమా ఏమాత్రం అందుకోలేకపోయింది.అసలు సరైన కథ లేకుండా ఈ సినిమాను కేవలం భారీ క్యాస్టింగ్ కోసమే తీశారా అనేలా ఈ సినిమా ఉండటంతో సదరు ప్రేక్షకుడు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపించలేదు.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలవడంతో ఈ సినిమాను తక్కువ సమయంలోనే ఓటీటీలో రిలీజ్ చేశారు.అయితే ఓటీటీలోనైనా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ భావించింది.

కానీ ఇక్కడ కూడా అల్లుడు అదుర్స్ చిత్రానికి ఎదురుదెబ్బ తగిలింది.సినిమాను థియేటర్లలో చూడనివారు ఓటీటీలో చూసి ఇదేం సినిమారా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు.

ఈ సినిమాలోని కథపై హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలు ఎలా నమ్మకాలు పెట్టుకున్నారు అని వారు ప్రశ్నిస్తున్నారు.ఇక ఈ సినిమాను చూసిన క్రిటిక్స్ అయితే సోషల్ మీడియాలో అల్లుడు అదుర్స్‌ను ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారు.

ఇలాంటి సినిమాను థియేటర్లలో చూడటం పక్కనబెడితే, కనీసం ఓటీటీలో కూడా ఎవరూ చూడరని, అసలు ఇలాంటి సినిమాను తాము ఇప్పటివరకు చూడలేదంటూ వారు మండిపడుతున్నారు.ఇక బెల్లంకొండ బాబు ఇప్పటికైనా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోతే, త్వరలోనే బిచానా ఎత్తేయాల్సి ఉంటుందని వారు అంటున్నారు.

అయితే ప్రస్తుతం బెల్లంకొండ బాబు బాలీవుడ్ ఎంట్రీపై ఫోకస్ పెట్టడంతో ఛత్రపతి చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయంపై కూడా పలువురు కామెంట్ చేస్తున్నారు.ఎప్పుడో వచ్చిన ఛత్రపతి చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేసి, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం ఏమిటో అంటూ వారు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube