సినిమాలు వేరు … నిజ జీవితం వేరు… రెండు ఒకేలా ఉంటాయని అనుకోవడం పెద్ద పొరపాటు.కానీ సాధారణ వ్యక్తులు సినిమాలను చూసి ఇంప్రెస్ అయ్యి అందులో జరిగినట్టే అన్నీ చేయాలని అనుకుంటూ ఉంటారు.
కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండే వారికి నిజానిజాల గురించి క్లారిటీ ఉంటుంది.సినిమా చూసి ఎవరు ఎలాంటి తప్పులు చేయకూడదని తెలియకుండా ఉండదు కదా.కానీ ఇవన్నీ తెలిసి కూడా అల్లు శిరీష్( Allu Sirish ) ఒక పిచ్చి పని చేసి బాగా ఇబ్బంది పడాల్సి వచ్చిందట.ఇంతకి అల్లు శిరీష్ ని ఇంప్రెస్ చేసిన ఆ సినిమా ఏంటి ? దాన్ని చూసి ఏం చేసి ఇబ్బందుల పాలయ్యాడు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అల్లు శిరీష్ పలుసార్లు ప్రేమలో పడి అవి విఫలం కాగా ఆ విషయాలను ఏ మాత్రం దాచుకోకుండా మీడియా ముందు చెప్పేస్తూ ఉంటాడు.తన మాజీ గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో జరిగిన ఫన్నీ సంఘటనలు కూడా పబ్లిక్ గా షేర్ చేస్తూ ఉంటాడు.తన తప్పు చేయడం లేదు ఏమాత్రం దాచుకోవాల్సిన అవసరం ఏముంది అనే టైపులో అల్లు శిరీష్ ప్రవర్తన ఉంటుంది.అలాగే ఒకసారి సూర్య సన్నాఫ్ కృష్ణన్( Surya S/O Krishnan ) సినిమాలో తన గర్ల్ ఫ్రెండ్ కోసం హీరో ఎలా అయితే హీరోయిన్ ఇంటికి వెళితే ఆమె ఇంప్రెస్ అయిపోయి అతనికి పడిపోతుందో అదే విధంగా తాను కూడా చేసి బొక్క బోర్లా పడ్డాడట.
తన గర్ల్ ఫ్రెండ్( Girl Friend ) తనతో గొడవపడి ఫోన్లో బ్లాక్ చేయడంతో మాట్లాడడానికి అవకాశం లేదని ఆవేశంతో తెల్లవారి ఫ్లైట్ బుక్ చేసుకుని తన గర్ల్ ఫ్రెండ్ బెంగళూరులో ఉంటుందని అక్కడికి వెళ్లిపోయాడట.కానీ అక్కడికి తీరా వెళ్లే సరికి తన అమ్మానాన్న ఉన్నారట.ఫోన్లో బ్లాక్ చేస్తే ఇంటికి వచ్చేస్తావా అంటూ పిచ్చ క్లాస్ పీకారట.తన గర్ల్ ఫ్రెండ్ కూడా అప్పటి నుంచి మాట్లాడడం మానేసిందట.ఇంప్రెస్ చేద్దామని వెళ్లి ఇరకాటంలో పడ్డాడు ఈ అల్లు వారి చిన్నబ్బాయి.మొత్తానికి ఆ ప్రేమ కూడా దొబ్బేసిందట.
మళ్ళి ప్రస్తుతం ఒక రాక్షసులాంటి అమ్మాయితో ప్రేమలో ఉన్నానంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అల్లు శిరీష్.ఇంతకు శిరీష్ ప్రేమిస్తున్న అమ్మాయిల సంఖ్య ఏంటో తెలిస్తే కామెంట్స్ లో మాకు తెలియజేయండి.