మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అల్లు అర్జున్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నటన, డాన్స్ పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి తో పాటు షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోటోని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే వైరల్ చేస్తున్నారు.అంతేకాక మామకు తగ్గ అల్లుడు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న “పుష్ప” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ చిత్రం ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం.