డ‌బ్బుల కోస‌మే ఫేస్‌బుక్ అలా చేస్తోందంటూ ఆరోప‌ణ‌లు.. మార్క్ ఆగ్ర‌హం

సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్ బుక్ సేవలు ఏడు గంటలపాటు నిలిచిపోవడంతో ఆ సంస్థకు తీవ్రమైన నష్టం కలిగిన సంగతి తెలిసిందే.ఇలా సర్వీసెస్ ఆగిపోవడంతో కస్టమర్స్ కూడా ఇబ్బందులు పడ్డారు.

 Allegations That Facebook Is Doing So For Money .. Mark Outraged, Mark Jukar Ba-TeluguStop.com

ఇకపోతే ఫేస్ బుక్ ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ బిలీయనీర్ జాబితా నుంచి కిందకు పడిపోయాడు.ఫేస్ బుక్ షేర్ వాల్యూ కూడా పడిపోయింది.

ఇకపోతే టెక్నికల్ ఇష్యూ వల్లే సర్వీసులకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది.

ఫేస్ బుక్ సంస్థపై ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ పలు ఆరోపణలు చేసింది.

ఫేస్ బుక్ సంస్థ కోట్ల మంది యూజర్స్ డేటాను అమ్ముకుందని ఆరోపించింది.ప్రతీ నెల ఫేస్ బుక్‌కు మూడు బిలియన్ మంది యూజర్స్ యాడ్ అవుతుంటారనే అంచనా ఉంది.

అయితే, ఫేస్ బుక్ సంస్థపై మాజీ ఉద్యోగి చేసిన విమర్శల పట్ల ఆ సంస్థ అధినేత మార్క్ స్పందించారు.ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణలను, ఇతరత్ర మీడియా కథనాలను కొట్టి పారేశారు.

వారి వారి లాభాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఫేస్ బుక్ సంస్థపైన దాడి చేస్తున్నారన్నారు.ఈ మేరకు ఫేస్‌బుక్ వేదికగా మార్క్ జుకర్ బర్గ్ పోస్టు పెట్టాడు.

Telugu Face, Franacae Hogen, Mark Jukar Barg-Latest News - Telugu

సదరు పోస్ట్‌లో ఫ్రాన్సెస్ హౌగెన్ మాటలకు అర్థం లేదని, ఆమె ఊరికనే ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తోందని పేర్కొన్నారు.నైతిక విలువలు, వ్యాపారం పరస్పర విరుద్ధ అంశాలని వాటిని ముడిపెట్ట విమర్శలు చేయడం సరికాదని మార్క్ తెలిపారు.సోషల్ మీడియా దిగ్గజం అయిన ఫేస్ బుక్ పిల్లలకు హాని చేస్తోందని, దానిని నియంత్రించాలని, తప్పులు కప్పిపుచ్చుకునేందుకుగాను ఫేస్ బుక్ ప్రయత్నిస్తోందని ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణలు చేసింది.ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్‌లో తప్పుడు సమాచారం ద్వారా సొసైటీపైన తీవ్రమైన ప్రభావం పడుతున్నదని ఫ్రాన్సెస్ హౌగెన్ విమర్శించింది.

అయితే, ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపణలను ఫేస్ బుక్ సంస్థ ప్రతినిధులు కొట్టి పారేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube